మాస్కులు ద్వారానే కొరోనా వ్యాప్తి నివారణ
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి కరోనా వైరస్ వ్యాప్తి నివారించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావ రిఖని పట్టణం గాంధీనగర్ కూరగాయల మార్కెట్లో సోమవారం విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో విక్రయదారులకు ఎమ్మెల్యే మాస్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొరోనా వైరస్ ప్రబలకుండా విధిగా ప్రతి ఒక్కరు మాస్కుల ధరించి రక్షణ పొందాలన్నారు. మాస్కుల వలన వ్యాధిగ్రస్తులు దగ్గిన, తుమ్మిన వైరస్ నుంచి మన శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందన్నారు.
అంతే గాకుండా మాస్కు వల్ల ముక్కు, నోట్లో నుంచి దుమ్ము దూళి వల్ల రక్షణ ••లుగుతుందన్నారు. రాష్ట్రంలో కొరోనా వైరస్ కట్టడికి సిఎం కెసిఆర్ చేస్తున్న మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరు బాసటగా నిలువాలన్నారు. కొరోనా వైరస్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్ డౌన్ ముగిసేంతవరకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల న్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, సిఐ పర్శ రమేష్ తదితరులు పాల్గొన్నారు.