Take a fresh look at your lifestyle.

బీసీ సిఎం ప్రకటించిన బిజెపికి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 02 : తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని బిజెపి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బిజెపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలుపుతుతామని ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఛైర్పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రచార కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ గత ఏడు దశాబ్ధాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని బీసీని ముఖ్యమంత్రిని చేయలేదని అన్నారు. 40 ఏళ్లుగా ఎదురు చూసిన బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించి, 27 శాతం నీట్ ఎంబిబిఎస్ లో రిజర్వేషన్స్ కల్పించిందని అన్నారు. సామాన్య కార్యకర్తలను ఉన్నత స్థానాలు కల్పించే ఏకైక పార్టీ బిజెపి అన్నారు. బిజెపిని అధిక మెజారిటీతో గెలిపించాలని, బీసీ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అన్నారు. దేశం దళిత, ఆదివాసీ సంఘాలు కూడా బీసీ ముఖ్యమంత్రి మద్దతు తెలిపాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైసర్ యు.చిన్నయ్య, ఓబీసీ కేంద్ర కమిటీ ఉద్యోగ సంఘాల నేతలు మల్లేష్ యాదవ్, వెంకట్ యాదవ్, సీహెచ్.రమేష్, ఎం.జయప్రకాష్, కోట అర్చన నేత, పెంజర్ల అనురాధ, ఉపాధ్యక్షులు అక్కెనపల్లి శ్రీనివాస్ చారీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.మహేష్ గౌడ, బి.శ్రీకాంత్ లాల్, అంబిక కుర్మయ, బొగ్గారపు ఉమ, లలిత్ కుమార్, పద్మ గౌడ్, మంగళగిరి శ్వేత, ఆల్వాల సువర్ణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply