Take a fresh look at your lifestyle.

9000 వేల కోట్లతో పటాన్ చెరు ప్రగతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 2: గత పది సంవత్సరాలలో పటాన్ చెరు నియోజకవర్గాన్ని 9వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసి పేదోడి జీవితంలో కొత్త వెలుగుల నింపామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్,  శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి ల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో ఏర్పాటుచేసిన యాదవుల ఆత్మీయ సమ్మేలనానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి యాదవ సంఘం తరఫున ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. 60 ఏళ్లలో తెలంగాణ  ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటే.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం 10 సంవత్సరాలలో పటాన్చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో పరిగెత్తించామని అన్నారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు రూపకల్పన చేయడంతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రామచంద్రాపురం భారతీయున్నారెడ్డి విషయంలో పరిధిలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు, దళిత బంధు, బి సి బంధు గృహలక్ష్మి మైనార్టీ బందు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలు అమలుచేసి పేదోడి జీవితాల్లో కొత్త వెలుగుల నింపామని అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు డిపాజిట్ల కోసం పోరాటం చేయాలని సూచించారు.అనంతరం ఎస్ఎన్ కాలనీకి చెందిన గనసేన యువజన సభ్యులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, డివిజన్ల అధ్యక్షులు గోవింద్, పృథ్వీరాజ్, ఐలేష్ యాదవ్, కృష్ణ కాంత్, యాదవ సంఘం అధ్యక్షులు రాగం రమేష్ యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply