- కేంద్రానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
- ప్రతిపక్షాల పట్ల సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని హితవు
- ఖమ్మంలో సీపీఐ(ఎం) నిరసన దీక్షలను ప్రారంభించిన తమ్మినేని
కరోనా వైరస్‌తో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నాటినుండి ప్రధాని నరేంద్రమోడీ కేవలం మా•లు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాల్సిన నిధులను నిర్లక్ష్యం చేస్తున్నారనీ, ఇకనైనా మాటలు మానుకుని తెలంగాణకు రూ.35వేలకోట్ల ఆర్దిక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ((ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) నిరసన దీక్షలు చేపట్టింది. తొలుత ఖమ్మంలో దీక్షలను ప్రారంభించిన అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతరెండు రోజులుగా దేశంలో కరోనా వైరస్ విపరీతంగా పెరిగిపోతోందనీ, ఈ పరిస్థితుల్లో లాక్డౌన్లో సాధించిన పాక్షిక విజయాలు కూడా వమ్మైపోతున్నాయన్నారు. ముఖ్యంగా దేశంలోని వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు పంపించేందుకు కూడా కేంద్రం వద్ద నిధులు లేవా అని ప్రశ్నించారు.
మోడీ ఎన్ని సార్లు మీడియా సమావేశాలు పెట్టినా రాష్ట్రాలు, ప్రజలు ఏం చేయా లనే చెపుతున్నారనీ, తన ప్రభుత్వ ఏంచేస్తుం దనేది చెప్పలేదన్నారు. దేశంలోని ప్రజలకు ఏమేరకు, ఎంత నిధులు కేటాయించేదీ చెప్పలేద న్నారు. ప్రతీ పేద కుటుంబానికి రూ.10వేల చొప్పున అందించాలన్నారు. మతపరమైన విషయాలను రెచ్చగొట్టవద్దన్నారు. క•ర్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, రాష్ట్ర కమిటీసభ్యులు బత్తుల హైమావతి, పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు యర్రా శ్రీకాంత్, కల్యాణం వెంక టేశ్వరరావు, బత్తుల లెనిన్, బండిరమేష్, రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్య దర్శి మాదినేని రమేష్, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు వై. విక్రమ్, బండిపద్మ, నందిపాటి మనోహర్, పారుపల్లి ఝాన్సీ, ఎంఏ జబ్బార్, నాయకులు తాతా భాస్కర్‌రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంత్, తదితరులు పాల్గొన్నారు.