Take a fresh look at your lifestyle.

రైతులతో మరోమారు చర్చలకు సిద్దం

చర్చలతోనే సమస్యలకు పరిష్కారం
రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి
బడ్జెట్‌లో వరాలు ప్రకటిస్తాం..ఫోన్‌ ‌కాల్‌దూరంలో ఉన్నాం
ఏడాదిన్నర పాటు సాగుచట్టాల అమలు నిలిపివేస్తాం
పార్లమెంట్‌ ‌సమావేశాలను విపక్షాలు సద్వినియోగం చేసుకోవాలి
అఖిలపక్షభేటీలో ప్రధాని మోడీ స్పీష్టీకరణ

రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పార్లమెంట్‌ ‌సమావేశాల నేపథ్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు సాగు చట్టాల అంశాన్ని ప్రస్తావించాయి. చర్చలతోనే సమస్యలను పరిష్కరించాలని కోరాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ’రైతులతో మాట్లాడడానికి కేంద్రం ఎప్పడూ సిద్ధంగా ఉంటుంది. రైతులకు కేంద్రం ఇచ్చిన ఆఫర్‌ ఇప్పటికీ వర్తిస్తుంది. ఏడాదిపాటు కొత్తసాగు చట్టాల అమలు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తాం. రైతుల సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుంది. రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బడ్జెట్‌లో రైతులకు వరాలు ప్రకటిస్తాం. పార్లమెంట్‌ ‌సమావేశాలను విపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని, అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గతంలో తాము సూచించిన ప్రతిపాదనలకు ఇంకా కట్టుబడే ఉన్నామని, ఈ విషయాన్ని తమ సహచరులకు చెప్పాలని మోదీ అఖిలపక్ష నేతలతో వ్యాఖ్యానించారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనమందరమూ దేశం గురించి ఆలోచించాలని మోదీ అఖిలపక్ష నేతలతో వ్యాఖ్యానించారు. కేంద్ర వ్యవసాయం మంత్రి తోమర్‌ అన్న వ్యాఖ్యలనే నేను పునరుద్ఘాటిస్తున్నా. మనం ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. మేము ఓ ప్రతిపాదన పెడుతున్నాం. ప్రస్తుతానికి వీరు వెళ్లండి. వి• రైతులతో చర్చించండి. వారెమన్నారో మాకు ఓ ఫోన్‌ ‌చేయండి.

సరిపోతుందన్న తోమర్‌ ‌వ్యాఖ్యలను ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయంపై తాము ఎలాంటి అరమరికల్లేకుండా ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. వివాదాస్పదమైన మూడు కొత్త సాగు చట్టాలను 18 నెలల పాటు సస్పెండ్‌ ‌చేసే అంశం ఇంకా సజీవంగానే ఉన్నట్లు మోదీ వెల్లడించారు. అన్ని అంశాలపై రైతులతో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు. కొత్త సాగు చట్టాలను 18 నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేయడానికి అంగీకరించడం లేదని, ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడిన అంశాలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి ఆ తర్వాత వి•డియాతో వెల్లడించారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపివేసే ప్రతిపాదనకు ఇప్పటికీ కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగా వెల్లడించారు. కేంద్రం రైతుల సమస్యను పెద్ద మనసుతో పరిశీలిస్తోందని ప్రధాని అఖిల పక్ష సమావేశంలో హావి• ఇచ్చారు.

జనవరి 22న వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉంది. తోమర్‌ ‌జీ వి•తో చర్చించడానికి ఫోన్‌ ‌కాల్‌ ‌దూరంలో ఉంటారనే విషయాన్ని ఈ సమావేశంలో ప్రధాని మరోసారి గుర్తు చేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి ట్వీట్‌ ‌చేశారు. రైతులు, కేంద్రం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ఏడాదిన్నర పాటు చట్టాలను నిలిపివేసే ప్రతిపాదనను కేంద్రం అన్నదాతల ముందు ఉంచింది. రైతులు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టారు. చివరి దఫా చర్చలు కూడా విఫలం కావడంతో..’బంతి వి• కోర్టులోనే ఉంది. చట్టాలు రద్దు మినహా..మేము సూచించినదానికంటే మెరుగైన ఆలోచన ఉంటే చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌రైతు సంఘాలకు సూచించారు.

చట్టాల రద్దుకే పట్టుబట్టిన రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్‌ ‌ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎర్రకోట దగ్గర నిరసనలు వ్యక్తం చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, సాగు చట్టాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. పార్లమెంట్‌ ఉభయసభల ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించాయి. ప్రస్తుతం దిల్లీ శివారుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. సాధారణంగా పార్లమెంట్‌ ‌సమావేశాలకు ముందు అఖిల పక్ష భేటీ ఉంటుంది. కానీ ఈసారి సమావేశాలు ప్రారంభమైన తర్వాత అఖిల పక్ష భేటీ నిర్వహించారు.

Leave a Reply