Take a fresh look at your lifestyle.

మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే… చూస్తూ ఊరుకోం

కంచెలు బద్దలు కొట్టి..ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం
కుక్క కాటుకు చెప్పు దెబ్బ  
నిజాం, కేసిఆర్‌ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు..కానీ సారూప్యత ఒకటే
ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు
తిరుగుబాటు  చేసినవారందరినీ అణచివేశాడు  
‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి
 
 “సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ పోరాటంలో కేసిఆర్ కుటుంబం పతనం అయ్యింది. నిజాం, కేసిఆర్ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు. కానీ సారూప్యత ఒకటే. బతుకమ్మ పండుగను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారు .. “
 
   “అమ్మగారు లేకపోతే..బతుకమ్మ ఆగదు . అమ్మగారు లేరు..బతుకమ్మ ఎవరు ఆడతారు అనుకోకండి…బంతి పూలతో..బతుకమ్మ ఉండేది . అమ్మగారూ ప్లాస్టిక్ పూలతో ఆడారు….వొచ్చే బతుకమ్మలో..ప్లాస్టిక్ పూలు ఉండకపోవచ్చు  ..”

   “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ పథకాలను అమలు చేస్తున్నాం … ఇప్పటి వరకు 8లక్షల కుటుంబాలు రూ.500 గ్యాస్ సిలిండర్ అనుకున్నాయి… 200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేసాం ..”
 
  “వంద రోజులు సీఎం గా 18 గంటలు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసాం .. మా ప్రభుత్వాన్ని పడగొడాతామంటే చూస్తూ ఊరుకోం .. కుక్క కాటుకు చెప్పు దెబ్బ … ఎన్నికల కోడ్ వచ్చింది, ఇపుడు టిపిసిసి అధ్యక్షుడిగా పని మొదలు పెట్టిన ..”
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 :  తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల పాలన ఎలా ఉంది.?  ప్రజలకు ఈ ప్రభుత్వంతో జరిగిదేంటి..? ఈ వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలేంటి..? ఆరు గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం హామీలను నెరవేర్చింది..? అసలు కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడానికి దోహదపడిరదేంటి..? అనే ఆసక్తికర  విషయాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ విమోచన దినానికి, 2023 డిసెంబర్‌-03వ తేదీకి ఒకే చరిత్ర ఉందన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి లభించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎన్ని మంచి పనులు చేసినా బానిసలుగానే చూశారని, స్వేచ్చను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం ప్రభువుల ఆగడాలు తట్టుకోలేక నాడు తిరుగుబాటు చేస్తే నేడు గులాబీ నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నారని వివరించారు. స్వేచ్ఛ లాక్కుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 1948 సెప్టెంబర్‌ 17లో దేశం ఒక్కసారిగా మన వైపు చూసింది. ప్రపంచంలో ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ వాళ్లకు స్పూర్తి ఇచ్చింది. అరాచకం నుంచి విముక్తి పొందేందుకు సాయుధ పోరాటం జరిగింది. నిజాం హయాంలోని ఖాసిం రజ్వీ ఆధిపత్యాన్ని తాను చలాయించాలని కేసీఆర్‌ అనుకున్నారు.
సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్‌ రావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ పోరాటంలో కేసిఆర్‌ కుటుంబం పతనం అయ్యింది. నిజాం, కేసిఆర్‌ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు. కానీ సారూప్యత ఒకటే. బతుకమ్మ పండుగను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారని సీఎం రేవంత్‌ ఫైర్‌ అయ్యారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు అని చెప్పారు. ఎవరు ఉన్నా లేకున్నా ఈ పండుగలు జరుగుతాయని చెప్పారు. ప్రైవేట్‌ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించామన్నారు. ధరణి పోర్టల్‌ ను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తే అసలు విషయం బయటపడుతుందని పేర్క్న్న్షొరు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  సామంతులలాగా అధికారం కొద్ది మంది అధికారుల చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకతను తీసుకువచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్నాచౌక్‌ వద్దు అన్న వారిని కూడా ధర్నా చేసుకోనిచ్చిన ప్రభుత్వం మాదని అన్నారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంబించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. ప్రగతిభవన్‌ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని, ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. ఉద్యమంలో మాట్లాడిన మాటలను మర్చిపోయి కేసీఆర్‌ తెలంగాణ సంస్కృతిని చెరిపే ప్రయత్నం చేశారన్నారు. మేం వచ్చిన తర్వాత జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశామన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం.
గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్‌,. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చామన్నారు. తెలంగాణ విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌(ఈఆర్సీ)లో కేసీఆర్‌ నాటిన గంజాయి మొక్క ఒకటి గృహజ్యోతి డబ్బులు ముందే డిస్కంలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందని, ఇచ్చిన వ్యక్తి ఇంటి పేరు కూడా తన్నీరని ఎద్దేవా చేశారు. ఈ తన్నీరుకు గతంలో రైతులకు ఉచిత విద్యుత్‌ డబ్బులు కేసీఆర్‌ ముందే ఇచ్చాడో లేదా తెల్వదా.. ఈ గంజాయి మొక్కలన్నింటిని సమూలంగా పీకేస్తాం అని రేవంత్‌ హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్‌ 3న తెలంగాణలో ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, స్వేచ్ఛకు మించింది ఏదీ లేదని నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యువకుల ఆత్మబలిదానాలతో సమైక్య పాలన నుంచి విముక్తి పొంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్‌ రాజరికపోకడలను మళ్లీ తీసుకువచ్చారు. తన వారసులే ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నారు. కేసీఆర్‌ నిజాం నకలునే మళ్లీ చూపించాడు. ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు. తిరుగుబాలు చేసినవారందరినీ అణచివేశాడు. దీంతో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌ పరిపాలనను తీసుకువచ్చారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. కవిత అరెస్ట్‌ పై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మగారు లేకపోతే..బతుకమ్మ ఆగదంటూ సెటైర్లు పేల్చారు. అమ్మగారు లేరు..బతుకమ్మ ఎవరు ఆడతారు అనుకోకండి.. బంతి పూలతో..బతుకమ్మ ఉండేదని తెలిపారు. అమ్మగారూ ప్లాస్టిక్‌ పూలతో ఆడారు. వచ్చే బతుకమ్మలో..ప్లాస్టిక్‌ పూలు ఉండకపోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్‌.  వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దించారన్న ఆయన నిజాం నకలునే కేసీఆర్‌ చూపించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదని  అన్నారు. ఏనాడు ప్రజల స్వేచ్ఛను కేసీఆర్‌ గౌరవించలేదని ఆరోపించారు.100 రోజులు సీఎం గా 18 గంటలు పనిచేసాం. ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసాం. మా ప్రభుత్వాన్ని పడగొడాతామంటే చూస్తూ ఊరుకోం. ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఇపుడు టిపిసిసి అధ్యక్షుడిగా పని మొదలు పెట్టాను. కాంగ్రెస్‌ పార్టీ లో చేరికల విషయం లో  ఏం జరుగుతుందో మీరు చూస్తారు అని అన్నారు.  వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మేము పాలకులం కాదు సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ప్రగతి భవన్‌ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని సీఎం పేర్కొన్నారు. ‘వైబ్రాంట్‌ తెలంగాణ-2025’ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.  రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించామని అన్నారు.  కొద్దిమంది అధికారులతో సాగించిన పాలనకు స్వస్తి చెప్పామని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేసి పారదర్శక పాలన అందించే ప్రయత్నం చేశాం అన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకెళుతున్నాం అన్నారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నాం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్‌ పథకాలను అమలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 8లక్షల కుటుంబాలు రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ అందుకున్నాయని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేసాం అన్నారు. జీరో బిల్‌ ను మేం అమలు చేస్తుంటే తెలివి తేటలు ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తున్నారు. తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలను నాటి వెళ్లారని, అవి దుర్గంధం వెదజల్లుతున్నాయన్నారు. అలాంటి గంజాయి మొక్కల్ని మొక్కలను ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం అని అన్నారు. రోజుకు 18గంటలు పనిచేసి మొత్తం గంజాయి మొక్కల్ని పీకేస్తాం అన్నారు. హరీష్‌ ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదని అన్నారు.
మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వంద రోజులు సీఎం గా 18 గంటలు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసాం అని, మా ప్రభుత్వాన్ని పడగొడాతామంటే చూస్తూ ఊరుకోం అన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అన్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చిందని, ఇపుడు టిపిసిసి అధ్యక్షుడిగా పని మొదలు పెట్టానని సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్రంపై రూ.9లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు మాత్రమే అని, కానీ ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్‌ తీసుకొచ్చారని అన్నారు. ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్‌ తో సామరస్యపూర్వక విధానాలతో ముందు వెళుతున్నాం అన్నారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నాం అన్నారు. అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తాం అన్నారు. ఇన్నాళ్లు కవులు కళాకారులను కేసీఆర్‌ తన గడీలో బంధించారని అన్నారు. దొరగారి భుజకీర్తులను సాగించాలని తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారని అన్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమ సూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వేల కోట్లకు చేరిందన్నారు. చట్టబద్ధంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం అన్నారు. బతుకమ్మను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారని అన్నారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు అని, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా బతుకమ్మ, బోనాల పండుగలు జరుగుతాయని అన్నారు.
ప్రైవేట్‌ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం అన్నారు. ధరణి పోర్టల్‌ ను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తే తప్ప అసలు విషయం బయటపడదని పేర్కొన్నారు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చరిత్ర చెబుతోందని అన్నారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైందని గుర్తు చేశారు. రాచరిక పోకడలతో వారసత్వాన్ని చలాయించాలని కేసీఆర్‌ ప్రయత్నించారని అన్నారు. ఖాసీం రిజ్వీలా తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసినవారిని కేసీఆర్‌ అణిచివేసే ప్రయత్నం చేశారని అన్నారు. సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను హరించారని అన్నారు. 75 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రజలు పోరాడి మళ్లీ స్వేచ్ఛను తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్‌ నయా నిజాంలా వ్యవహరించారని అన్నారు. నిజాం విధానాల నకలును కేసీఆర్‌ అమలు చేశారని అన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్‌ విధానాలను వ్యతిరేకించి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,  సీఎం సీపీఆర్‌.ఓ అయోధ్యరెడ్డి , తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(టీయూడబ్ల్యూజే) కార్యదర్శి విరహత్‌ అలీ పాల్గొన్నారు.

Leave a Reply