Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్ష చేసే సాధనాలు, పద్ధతులు, ఫలితాలు

ఈ ‌సమస్యను పరిష్కరించడానికి ఆర్‌ఎన్‌ఏని  రెండు  ప్రామాణిక డిఎన్‌ఏలుగా  ఎంజైముల సాయంతో మారుస్తారు. ఈ ప్రక్రియలో ఈ మధ్య కాలంలో జాగు జరుగుతోంది. వాటి వల్ల కూడా కరోనా వ్యాప్తి జరుగుతోంది. పరీక్షల్లో వ్యవధిని తగ్గించేందుకు చౌకగా పరీక్షలు జరిగేట్టు చూడటానికి   ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆప్‌ ‌మెడికల్‌ ‌రిసెర్చ్ ‌కొన్ని మార్గదర్శకాలను సూచించింది. మన దేశంలో కోవిడ్‌ -19‌ని 72 ప్రభుత్వ లాబొరేటరీల్లో మాత్రమే పరీక్షించే సదుపాయం ఉంది.

కొరోనా వైరస్‌ ‌పరీక్షలను ప్రయోగశాలల్లో పరీక్షించే తీరును ఒక్కసారి పరిశీలిద్దాం. మన దేశంలో ఇలాంటి ఘోరమైన వైరస్‌లపై ప్రయోగాలు చేయడానికి అవసరమైన ప్రయోగశాలలు, పరికరాలు ఉన్నాయా..కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మంగళ వారం ఉదయం వరకూ దేశ వ్యాప్తంగా  440పైగా కొరోనా కేసులు వివిధ రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ ‌తగ్గే సూచనలు ఏమీ కనిపించడం లేదు. చాలా రాష్ట్రాలు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించాయి. సామాజిక దూరాన్ని పాటించాలని హెచ్చరిస్తున్నాయి. ఈ చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రభుత్వ ప్రయోగశాలల్లో ప్రయోగాల తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఇందుకు కారణం తగిన పరికరాలు లేకపోవడమే.  వైద్య పరిశోధనల కేంద్ర సంస్థ ఇండియన్‌  ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రిసెర్చ్(ఐసిఎంఆర్‌)  ‌గత వారం తన మార్గదర్శకాలను సవరించింది.

 

ప్రైవేట్‌ ‌లాబొరేటరీలు కరోనా పరీక్షలు చేయవచ్చని అంగీకారం తెలిపింది. లాబొరేటరీలు వాణిజ్య కిట్లను వాడవచ్చని సూచన చేసింది. ప్రైవేట్‌లాబ్‌లు ఆహార, ఔషధ పరిపాలన విభాగం అనుమతి పొంది ఉండాలి. అమెరికాకి చెందిన పుడ్‌ అం‌డ్‌ ‌డ్రగ్‌ అడ్మినిస్టేషన్‌  (ఎఫ్‌డిఓ) ఆమోదం పొంది ఉండాలి. పరీక్షలు ఎలా చేస్తారనే అంశంపై ట్రాన్స్‌నేషనల్‌  ‌హెల్త్ ‌సైన్సెస్‌ అం‌డ్‌ ‌టెక్నాలజీ  ఇనిస్టిట్యూట్‌  ‌ప్రొఫెసర్‌ ‌గురుప్రసాద్‌ ‌మెడిగేషిని ప్రింట్‌ ‌ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఈ వివరాలు తెలిపారు.

దటి చర్య..శాంపిల్స్ ‌సేకరణ

కొరోనా శ్వాస సంబంధమైన వ్యాధి, శ్వాస కోసాల్లో ఇన్‌ ‌ఫెక్షన్‌ ‌వల్ల ఇది వస్తుంది. ముక్కు నుంచి నీరు కారడం, గొంతులో శ్లేష్మం పేరుకుని పోవడం, తలనొప్పి, జ్వరం ఈ వ్యాధి లక్షణాల్లో ముఖ్యమైనవి. ముక్కును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, ముక్కు నుంచి వచ్చే నీటిని ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. దస్తీ  లేదా చేతిగుడ్డ నిరంతరం జేబులో ఉంచుకోవాలి. తుమ్ము వచ్చినప్పుడు దస్తీ అడ్డు పెట్టుకోవాలి. తరచూ తుమ్మడం, దగ్గడం  వంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుని వద్దకు వెళ్ళాలి. గొంతులో తెమడ, ముక్కు ద్వారా కారే నీరును శాంపిల్స్‌గా సేకరించి వైద్యుల పరీక్షకు అందజేయాలి. ఇలా సేకరించిన శాంపిల్స్‌ను అర్హత పొందిన ప్రయోగశాలలకు పంపిస్తారు.
ఇది అంటురోగం..అందువల్ల దూరాన్ని పాటించాలి,  కొరోనా వచ్చిన వారు దగ్గుతుంటే ఎదురుగా నిలబడకూడదు. కొరోనా నిర్ధారణ అయిన వారు ఇతరులతో కలవకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరు ఉమ్మి  వేసినా ప్రమాదమే. గుట్కాలు,   పాన్‌లు నమిలేవారు కూడా బహింరగ ప్రదేశాల్లో ఉమ్మి వేయ కూడదు. అనుమానితుల నుంచి సేకరించిన నమూ నాలను కింద పడకుండా లాబొరేటరీలకు  తీసుకుని వెళ్ళాలి. ఆ నమూనాలను ద్రవాల్లో వేసి ప్రమాద కరమైన వైరస్‌ ఉం‌టే వేరు చేస్తారు. కొరోనా రైబోన్యుక్లిక్‌ ‌యాసిడ్‌తో ఉంటాయి. వాటిని వేరు చేయాలి. వీటిని వేరు చేసిన తర్వాత ప్రత్యేక కిట్‌లలో ఉంచాలి.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్‌ఎన్‌ఏని  రెండు  ప్రామాణిక డిఎన్‌ఏలుగా  ఎంజైముల సాయంతో మారుస్తారు. ఈ ప్రక్రియలో ఈ మధ్య కాలంలో జాగు జరుగుతోంది. వాటి వల్ల కూడా కరోనా వ్యాప్తి జరుగుతోంది. పరీక్షల్లో వ్యవధిని తగ్గించేందుకు చౌకగా పరీక్షలు జరిగేట్టు చూడటానికి   ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆప్‌ ‌మెడికల్‌ ‌రిసెర్చ్ ‌కొన్ని మార్గదర్శకాలను సూచించింది. మన దేశంలో కోవిడ్‌ -19‌ని 72 ప్రభుత్వ లాబొరేటరీల్లో మాత్రమే పరీక్షించే సదుపాయం ఉంది. ఇళ్ళలో కూడా పరీక్షలు జరుపుకునే సదుపాయాలను ఐసిఎంఆర్‌ ‌సూచిస్తోంది. ఇవి అందుబాటులోకి వస్తే ఎవరిమటుకు వారు తమకు వైరస్‌ ‌సోకిందో లేదో నిర్ధారణ చేసుకోవచ్చు.
– ‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply