Take a fresh look at your lifestyle.

‘‘చైతన్య శీలి, సాహితీవేత్త, బోయి భీమన్న’’

(‌నేడు భీమన్న జయంతి సందర్భంగా…)

సామాజిక చైతన్యం ఆశించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచ యిత ఆయన. ఒక మారు మూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్‌  ‌పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాల ందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికం, అంటరానితనం చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. అంబేద్కర్‌ ‘‌కులనిర్మూలన’ రచనను తెలుగులోకి అనువదించా రీయన.. 1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురులో ఓ హరిజన కుటుంబంలో నాగమ్మ, పుల్లయ్య దంపతుల సంతానంలో ఈయన ఒకరు.  వారు ఐదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పుల్లయ్య తన మగపిల్లలకు ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టాడు. భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి.చేశారు. బోర్డు హైస్కూలులో చరిత్ర ఉపాధ్యాయునిగా చేరారు. ఆంధ్రప్రదేశ్‌ అనువాద విభాగం డైరెక్టర్‌ ‌గా, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ‌బుక్స్ ‌గా 1964 వరకు బాధ్యతలు నిర్వహించారు.

పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను 70 పుస్తకాలుగా రాసారు. పుస్తకాల పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని రాసారు. అంబేడ్కర్‌ ‌జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రచనలు చేసారు. ఆయన గీతం ‘జయ జయ జయ అంబేడ్కర!’ దళితులకు జాతీయగేయమై ఊరూరా ప్రార్థనా గీతమైంది.పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డా. బోయి భీమన్న పేరుతో సాహిత్య పీఠం ఏర్పాటు చేసి, రచనలను ప్రచురించారు. అనేకమంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు జరుగుతున్నాయి. హైమావతి చక్కని కథనాత్మక శైలిలో వ్రాసిన ‘‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న’’ గ్రంథం ఆయన సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దేశంలో  ‘భిన్నత్వంలో ఏకత్వం’  మాదిరి, భీమన్న రచనల్లో ఆ లక్షణం కనిపిస్తుంది. అంబేడ్కర్‌ ‌విశ్లేషించిందీ, భీమన్న వ్రాసిందీ అదే! జీవితాంతం ఆయన జాతీయవాది.

ఒకప్పుడు ‘బ్రాహ్మణ’ శబ్దాన్ని చదువుకున్న వాళ్ళనీ, ఆలోచనాపరుల్నీ సూచించడానికి ప్రయోగించారు. సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణ వ్యవస్థలోకి చేరిన తర్వాత కుల సూచికగా మారిపోయింది. ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, క్రమేపీ ఒక వర్గంగా తయారయ్యారు. సామాజిక ఉద్యమ బాటలో పయనించిన వాడు అంబేద్కర్‌. అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయి భీమన్న! భీమన్న సమగ్రసాహిత్యం పేరిట మొదటి సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం విడుదల చేసింది  . దీనిలో ‘పాటలలో అంబేద్కర్‌’  ఒక భాగం. దీనిలో అంబేడ్కర్‌ ‌వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని వర్ణించిన 118 పాటలు ఉన్నాయి.  కుల నిర్మూలనను బలంగా వ్యతిరేకించిన నాటకం పాలేరు. 1988 నాటికి పాలేరు నాటకానికి ఏభై యేళ్ళైందని రచయితే చెప్పారు.  ‘పాలేరు’ నాటకంలో వెంకన్న, వనబాలల ప్రేమకథలో,  ‘రాగవాసిష్ఠం’ నాటకంలో అరుంధతి, వశిష్ఠుల ప్రణయ గాథలో, మరికొన్ని రచనల్లోను కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించారు.
సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదనీ, మంచివాళ్ళూ ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం. పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుంటుంబం నుండే వచ్చినా, సంకుచిత మూర్ఖ కులతత్వ వాదులు లేని వాళ్ళూ ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు. అంబేద్కర్‌, ‌భీమన్న ఇరువురి జీవితాల్నీ పాలేరు నాటకం స్ఫురింపజేసేటట్లుంది. ఇరువురూ చదువుకోవడం వల్లనే అనేకమంది దళితులకి ఆదర్శం కాగలిగారు. యాదృ చ్ఛికంగా ఇరువురూ కులాంతర వివాహాలనే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని జీవితంలో ఆచరించి చూపి ఆదర్శ వంతుల య్యారు.

‘గుడిసెలు కాలిపోతున్నై’ (1973) కావ్యంలో ఏడాది కోసారి దళితుల గుడిసెలెందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్త గుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్లకోసం వచ్చేవారిని నిలదీసే చైతన్యం కలగాలనే ఆశయం కనిపిస్తుంది.  ‘కూలిరాజు’ (1946) నాటకంలో కులంతో పాటు ఆర్థికాంశాల్ని కూడా స్పర్శించారు.‘ధర్మం కోసం పోరాటం’లో బహుజనులంతా రాజ్యాధికారదిశగా పయనించడానికి సూచనలు చేశారు. వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు తదితరులంతా  దళితులేనని, వారు రాసిన భారత, రామాయణ, భాగవతాలు తమవేనని చెప్పడంలో భీమన్న దృక్పథం అర్ధమవుతుంది. హింసావాదానికి భీమన్న వ్యతిరేకి. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి, కులం, వర్గం వేరని వాదించిన కోనాడ సూర్యప్రకాశరావుకి ‘‘పాలేరు’’ నాటకాన్ని అంకితమిచ్చారు. పాలేరు నాటకానికి వ్రాసిన ముందుమాటలో భీమన్న స్పష్టంగానే వర్గం, కులం పట్ల తన అభిప్రాయాల్ని ప్రకటించారు. ‘భారత్‌లో వర్గపద్ధతి లేదు. వర్ణవ్యవస్థ అంటే కుల వ్యవస్థ  వుంది. ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరాని తనాన్ని తొలగించాలి’ అంటారాయన.

అంబేడ్కర్‌ ‌భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే… రచనలు
రాగవైశాఖిబీ రాభీలు (కవితా సంకలనం), గుడిసెలు కూలిపోతున్నై’ కవితాసంపుటి 1975 (కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది). భీమన్న ఉగాదులు, భీమన్న కావ్యకుసుమాలు, మోక్షం నా జన్మహక్కు, చివరిమెట్టుమీద శివుడు, కూలీ శతకం, రాగోదయం, అకాండతాండవం, గిల్లి చెబుతున్నా, మధుబాల, మధుగీత, దీపసభ, పాలేరు (నాటకం), కూలిరాజు, అసూయ, ప్రగతి, పడిపోతున్న గోడలు, రాగవాసిష్ఠం, ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు, బాలయోగి, చిత్రకళాప్రదర్శనం (నాటికల సంపుటి), నవజీవన్‌ ‌పత్రిక,చండాలిక (టాగూర్‌ – ‌చండాలిక కు అనువాదం), వచన రచనలు సవరించు, ఏకపద్యోపాఖ్యానం, ఇదిగో ఇదీ భగవద్గీత, జన్మాంతరవైరం, పురాణాలలో హరి-గిరిజన మనీషులు, ధర్మం కోసం పోరాటం, అంబేద్కరిజం, అంబేత్కరమతం జానపదుని జాబులు…

ఆయన రచనలు. పురస్కారాలు
ఆంధ్ర విశ్వకళాపరిషత్‌- ‌కళా ప్రపూర్ణ – 1971
పద్మశ్రీ  – 1973
కాశీవిద్యాపీఠం గౌరవ డాక్టరేట్‌ – 1976
‌పద్మ భూషణ్‌  – 2001
‌కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌, 1991‌లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యలో విశిష్ట పురస్కారం, తంగిరాల కృష్ణప్రసాద్‌ ‌స్మారక అవార్డు – 2004, భీమన్న డిసెంబర్‌ 16.2005 ‌న మరణిం చారు. ప్రతీ రచయిత ఈయన్ను స్పూర్తి గా తీసుకుని రచనలు చేయాలి. ఆయన జయంతి  జరు పుకొని సేవలను స్మరించుకుందాం.

kamidi satish
కామిడి సతీశ్‌ ‌రెడ్డీ, జడలపేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా, 9848445134..

Leave a Reply