Take a fresh look at your lifestyle.

ఈ ‌పాలనలో ఓబీసీలకు ఒరిగిందేమిటి ?

-డా. ముచ్చుకోట  సురేష్‌ ‌బాబు,
అధ్యక్షులు, గౌతమ్‌ ‌బుద్ధ అభివృద్ధి సమాఖ్య.

భారతదేశంలోని ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి లు) అనేది దేశంలో చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న సామాజికంగా  విద్యాపరంగా వెనుకబడిన వర్గాల సమూహం. భారత ప్రభుత్వం ఓబిసి లను ప్రత్యేక వర్గంగా గుర్తిస్తుంది, వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి వారికి విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్‌ ‌వంటి ప్రత్యేక నిబంధనలను అందిస్తుంది. గత కొన్నిసంవత్సరాలుగా, ఓబిసి లు విద్య, రాజకీయాలు, వ్యాపారంతో సహా వివిధ రంగాలలో అణగత్రొక్కబడినారు. విద్య వైద్యం ఉపాధి రంగాలలో ప్రభుత్వాల చేయూత లేకపోవడంతో అప్పులపాలై జీవితాలు దుర్భరంగా  తయారయ్యాయి.  ఓబిసిలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వారిలో డెబ్భై శాతం ఇప్పటికీ పేదరికంలో జీవిస్తున్నారు, స్వచ్ఛమైన నీరు  పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు, వివక్ష మరియు హింసకు గురవుతున్నారు. కొన్ని ఓబిసి  కమ్యూనిటీలు మెరుగైన ఓబిసి  సమూహాలు అలాగే  షెడ్యూల్డ్ ‌కులాలు, షెడ్యూల్డ్ ‌తెగల వంటి ఇతర వర్గాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నందున, నిశ్చయాత్మక చర్య విధానాల ప్రయోజనాలు కూడా సంవత్సరాలుగా పలుచనబడ్డాయి. ఓబిసి ల ఆందోళనలను పరిష్కరించడంలో రిజర్వేషన్‌ ‌విధానం యొక్క సమర్ధతపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మరికొందరు %దీ% కమ్యూనిటీలను చేర్చడానికి రిజర్వేషన్‌ ‌విధానాన్ని విస్తరించాలని వాదిస్తారు, అయితే మరికొందరు రిజర్వేషన్లు కులం లేదా కమ్యూనిటీ కంటే ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఉండాలని వాదిస్తున్నారు. దేశంలో ఓబిసి ల విధి సంక్లిష్టమైన  బహుముఖ సమస్య. వారు వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ, అనేక సవాళ్లు మిగిలి ఉన్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించడానికి కేవలం నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు మాత్రమే కాకుండా, ఓబిసిలను చారిత్రాత్మకంగా అట్టడుగున ఉంచిన నిర్మాణాత్మక అసమానతలు మరియు వివక్షలను పరిష్కరించే చర్యలను కూడా కలిగి ఉన్న సమగ్ర విధానం అవసరం.  ఎంతో ఆర్భాటంగా బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం ప్రకటించి మూడు  సంవత్సరాలవుతుంది.  మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు సృష్టించి 728 చైర్మన్‌, ‌డైరెక్టర్ల పదవులను ఎవరి కులపరిధిలో వారికి ఇవ్వడం జరిగింది . మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా, ఛైర్మన్‌, ‌డైరెక్టర్‌ ‌పదవుల్లో అన్ని జిల్లాలకు  ప్రాతినిధ్యం కల్పించామని చెబుతున్న వాస్తవానికి చాల జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. బడుగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌డైరెక్టర్ల ఎంపిక  రెడ్డి కులస్తులు  ప్రధాన భూమిక పోషించారు. కులాల పుట్టుక, జీవన శైలి, సామాజిక స్థితిగతుల గురించి ఏమాత్రం  తెలియని వారు కార్పొరేషన్ల క్రియాశీలక సభ్యులను ఏర్పాటు చేస్తే ఇలా అఘోరిస్తాయి.  రెడ్డి కులానికి మాత్రం రాష్ట్రంలో ఉన్న కీలకమైన పదవులను, రాష్ట్ర సంపద లభించే పదవులను ఇచ్చుకోవడంతోపాటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, హైకోర్టు జిల్లా కోర్టుల జీపీలను, స్కిల్‌ ‌డెవలప్మెంట్‌, ఇం‌డస్ట్రియల్‌ ఇ‌న్ఫ్రా స్ట్రక్చర్‌ , ‌సమాచార కమిషనర్ల, సలహాదారులు అంతా రెడ్లే.  ఆర్థికంగా పటిష్టంగా ఉన్న శాఖలు, ఆదాయ వనరులున్న శాఖల నామినేటెడ్‌ ‌పదవులు రెడ్డి సామాజిక వర్గానికి 720 పైగా ఇచ్చి వారిని  సమాజానికి తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో భాగమే. విద్య, ఆరోగ్యం, ప్రాజెక్టులు, స్కిల్‌ ‌డెవెలప్మెంట్‌, ‌మీడియా, టెంపుల్‌ ‌కమిటీలు, మార్కెట్‌ ‌కమిటీలు, విశ్వవిద్యాలయాల పాలకమండలి సభ్యులు, రాయలసీమ, కోస్తా , ఉత్తరాంధ్ర ఇంచార్జులు, స్థానికంగా ఉన్న రేషన్‌ ‌షాపులు, ఆహార పంపిణీ , వంట ఏజెన్సీ, డిష్‌, ‌కేబుల్‌ ‌నెట్‌, ‌రవాణా ఏజెన్సీ , కస్టమర్‌ ‌హైరింగ్‌ ‌సెంటర్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ ‌చైర్మన్లు   అది ఇది అని కాదు లాభం వచ్చే అన్ని రంగాల్లో ఈ కులస్తులు తిష్టవేశారు. బీసీ కులాల అభివృద్ధికి పాటు పడుతున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆచరణలో ఈ కులాల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది. సమాజం ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రజల్లో కూడా దానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో మెకనైజేషన్‌ ‌పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు,-చేతివృత్తులు తమ ఆస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధారపడిన కులాలు, వర్గాలకు యాంత్రీకరణ%–%-కార్పొరేటీకరణ దక్కాలి. కానీ ప్రస్తుతం వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్‌-, ఐరన్‌ ‌పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్‌ ‌పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలుగా మారారు. ట్రాక్టర్లు-%–%సా మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బతింది. డ్రై క్లీనింగ్‌ ‌షాపులు వల్ల చాకలి, నేత మిల్లులు రావడంతో నేత వృత్తి, బ్యూటీపార్లర్లు, హేర్‌ ‌కటింగ్‌ ‌సెలూన్ల రాకతో మంగళి, రెడీమేడ్‌ ‌దుస్తులతో దర్జీలు, జ్యూయెలరీ షాపులతో విశ్వ బ్రాహ్మణుల వృత్తులు దెబ్బతిన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు నాలుగేళ్లుగా  కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు  ఉత్సవ విగ్రహాలుగా మారాయి. కులాల సమస్యలపై అవగాహన ఉన్న వారు తమకు కావలిసిన పథకాలను డిజైన్‌ ‌చేయగలరు, కానీ కార్పొరేషన్ల చైర్మన్‌, ‌డైరెక్టర్ల నియామకం అస్తవ్యస్తంగా తమ చెప్పుచేతల్లో ఉన్న వారికి ఇచ్చారు.  సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు. కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కింది స్థాయిలో అర్థం చేసుకుని పరిష్కరించే అవకాశం కలుగుతుంది. మిగతా కులాలకు ఎంబీసీ కార్పొరేషన్‌ ‌ద్వారా, సంచార జాతుల కార్పొరేషన్‌ ‌ద్వారా సబ్సిడీ  రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటే ఈ కులాల్లో సమగ్ర అభివృద్ధికి పునాదులు పడతాయి. యాంత్రీకరణతో కార్పొరేట్‌ ‌ప్రాబల్యం పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బతో కుల వృత్తులు%–%చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. కరోనా కల్లోలంతో దెబ్బతిన్న కుల వృత్తుల కుటుంబాలకు కుల వృత్తులు%–%చేతి వృత్తుల వారికి చేయూత అందిస్తామనే ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి రావడం లేదు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వకపోగా. బీసీలకు రూ.లక్ష- రూ.2 లక్షల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. కానీ, బడా కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రుణాలు ఇస్తున్నారు. వారు వాటిని కట్టకపోతే మాఫీ చేస్తున్నారు. పేదలకు రుణాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా బ్యాంకులు తమ వైఖరి మార్చుకుని బీసీలకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి. అందుకు బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుదారుకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆకలి, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలి.నాలుగు  సంవత్సరాలుగా సూక్ష్మ బిందు సేద్యానికి ఒక్క రూపాయి కేటాయించలేదు, రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఇస్తామని బూటకాపు హామీ ఇచ్చిన ప్రభుత్వం  మూడేళ్లయినా ఒక్క పనిముట్టు ఇవ్వలేదు. ఇక ఇంటిపన్ను, చెత్తపన్ను, చార్జీల మోత, కరెంటు చార్జీల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. నవరత్నాల లో  బిసి, ఎస్సీ ఎస్టీలకు ఒక్క రత్నం కూడా లేదు. సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులతో ఎస్సీల కోసం ఒక్క ప్రత్యేక పధకం అమల్లో లేదు.  రద్దు చేసిన ఎస్సీ కార్పోరేషన్‌, ‌మరియు ఎన్‌ఎస్సెఫ్డిసి  రుణాలు ను తక్షణమే పునరుద్ధరించాలి, సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం ప్రకారం నిధులు తో ఎస్సీ ల ఆర్థిక పురోభివృద్ధి / ఇన్కం జనరేషన్‌ ‌స్కీమ్‌ ‌లు పునరుద్ధరించాలి. ఎస్సీ కార్పోరేషన్‌ ‌ద్వారా భూమి కొనుగోలు పథకం పునరుద్ధరణ చేసి బిసి ఎస్సి ఎస్టీ మైనారిటీ పీజీ  విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్‌ ‌పునరుద్ధరించాలి.
బెస్ట్ ఎవైలబుల్‌ ‌స్కూళ్లు పునరుద్ధరించి, బహుజన పిల్లలకు సి  కేటగిరి మెడికల్‌ ‌సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు పరచి  అంబేద్కర్‌ ఓవర్సీస్‌ ‌విద్యా పథకాలు పునరుద్ధరించాలి. బుక్‌ ‌బ్యాంక్‌ ‌స్కీమ్‌ ‌పునరుద్ధరణ. పేదల ఇళ్ల స్థలాల కోసం  ఎస్సీ  అసైన్డ్ ‌భూముల సేకరణ ఆపాలి, కులాంతర వివాహాల ప్రోత్సాహం ఇవ్వాలి. దళిత బంధు పథకం ఇచ్చి,   రాష్ట్ర పారిశ్రామిక విధానం లో బీసీ, ఎస్టీ, ఎస్సీ ల కు స్థలాల కేటాయింపు, విద్యుత్‌, ‌నీరు చార్జీలులో రాయితీ ఉండాలి. శిధిలమైన హాస్టళ్లకు నాడు నేడు ద్వారా బాగుచేసి మౌలిక, ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. మూత పడిన ఏపీ  స్టడీ సర్కిల్‌ ‌స్థలాన్ని కాపాడి, బిసి స్టడీ సర్కిల్‌ ‌తెరిచి మెస్‌ ‌చార్జీలు పెంచి, బ్యాక్‌ ‌లాగ్‌  ‌పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఉన్నత విద్య అభివృద్ధిలో భాగంగా విశ్వవిద్యాలయాలను యుద్ధప్రాతిపదికన నియామకాలు చేపట్టి విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తమ హక్కుల కోసం ఈ కులాలు ఉద్యమం చేయడం తప్పదు.

Leave a Reply