Take a fresh look at your lifestyle.

తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు: ఎసిపి

వాట్సాప్‌ ‌గ్రూపులలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మి భయాందోళనకు గురి కావొద్దనీ సిద్దిపేట ఏసిపి రామేశ్వర్‌ ‌తెలిపారు. ఈ మేరకు గురువారమిక్కడ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ…గత రెండు మూడు రోజుల నుండి వాట్సాప్‌ ‌గ్రూపుల్లో ఉదయం 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు షాపులు, కూరగాయల మార్కెట్లు, మెడికల్‌ ‌షాపులు తెరిచి ఉంటాయని, ఉదయం 9 గంటల తర్వాత అన్ని రకాల షాపులు మూసి వేస్తారని మరియు ఎవరూ రోడ్లపైకి రావొద్దనీ, వస్తే చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారనీ, పాసులు చెల్లయని పోలీస్‌ ‌శాఖ జారీ చేసిందని కొంతమంది వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాట్సాప్‌లలో వైరల్‌ ‌చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారనీ అన్నారు. ఇలా తప్పుడు సమాచారాన్ని పోస్టులు చేస్తూ వైరల్‌ ‌చేస్తున్న గ్రూప్‌ అడ్మిన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ‌నిబంధనల ప్రకారం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మెడికల్‌ ‌షాపులు తెరచి ఉంటాయనీ, 5 గంటల తర్వాత అన్ని షాపులు బంద్‌ ‌చేయడం జరుగుతుందన్నారు.

ప్రజలు వాట్సప్‌ ‌గ్రూపులలో వచ్చే పుకార్లను నమ్మొద్దనీ, ఏదైనా అనుమానం ఉంటే సంబంధిత అధికారులను అడిగి నిజా నిజాలు తెలుసుకోవాలనీ, ప్రజలు అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు. లాక్‌డౌన్‌ ‌సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన పాసులన్నీ చెల్లుతాయన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓపికతో, నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ఎవరితో అమర్యాదగా ప్రదర్శించవద్దన్నారు. వాహనాలను ఆపి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పంపించాలని, అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వాహనాలను మాత్రమే సీజ్‌ ‌చేయాలన్నారు. కొంత మంది అధికారులు, సిబ్బంది పాసులు చింపి వేయడం జరుగుతుందని, మా దృష్టికి వచ్చిందని అధికారులు, సిబ్బంది ఎవరూ పాసులు చింపి వేయవద్దని పాసులు అన్ని చెల్లుతాయని సిద్దిపేట ఏసిపి రామేశ్వర్‌ ‌తెలపారు.

Leave a Reply