Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్యకు మంగళారతులుతో ఘన స్వాగతం పలికిన మహిళా మణులు 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 25 : మొయినాబాద్ మండల పరిధిలోని చందనగర్,కుత్బుదిన్ గుడా,ఎల్కగుడా,గ్రామాలలో  ప్రజా ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య ను మంగళహారుతులతో స్వాగతం పలికిన మహిళా మణులు.బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ అభివృద్ధి జరిగిందన్నారు యాదన్న.చేవెళ్లలో మళ్ళీ బిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం అని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు.పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు,యాదన్న అభిమానులు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు.చందనగర్,కుత్బుదిన్ గుడా,ఎల్కగుడా గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.గ్రామ గ్రామాన ఎమ్మెల్యే అభ్యర్థి యాదన్నకు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు.గ్రామాల్లో కాలి నడకన వీధివిది తిరుగుతూ గ్రామస్తులతో మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఆశీర్వాద యాత్రలో చిన్నా పెద్ద తేడా లేకుండా భారీగా తరలివచ్చారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదన్న వివరించారు.కాంగ్రెస్ నేతలు 70 ఏళ్లుగా మాయ మాటలు చెబుతూ అధికారంలో కొనసాగారన్నారు.ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య మండిపడ్డారు.ఎన్నికల సమయంలో ప్రజలకు అఢ్డగోలు హామీలు ఇస్తూ మోసగించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు.గత పాలకులు షూరిటీ ఉన్న వారికే ప్రభుత్వ రుణాలు అందించేవారని సామాన్యులకు ప్రభుత్వ పథకాలు దక్కలేదాన్నారు.తెలంగాణ రాష్ట్రంలో షరతులు లేకుండానే అర్హులకు రుణాలు అందించడమే కాకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఎవరు ఏ రంగంలో స్థిరపడాలనుకుంటే వారికి కేసీఆర్  అవకాశం కల్పించారని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్ కు బాసటగా నిలిచారని రాబోయే ఎన్నికల్లోనూ అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళిత వర్గాల అభ్యున్నతి కోసం దళితబందు  పథకం అమలు చేసి అభివృద్ధి పరిచారన్నారు.దళితుల  జీవితాల్లో వెలుగులు కెసిఆర్ నింపిన్నారన్నారు.రకరకాల వ్యాపారాలు ప్రారంభించి పది మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టంలోని దళితులందిరికి ప్రయోజనం చేకూరిందన్నారు.ఇళ్లు లేని వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు.ప్రజలను తప్పు తోవ పట్టించాలనుకుంటే ఎవరి వల్ల కాదన్నారు.రైతులకు అవసరమైన విద్యుత్,నీళ్లు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు.గ్రామాల్లో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారన్నారు.పెన్షన్లు,ఇచ్చి రోడ్డు వేసి గ్రామాలను అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఘంటాపథంగా చెప్పారు.కేసీఆర్ మనసున్న మహారాజు పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నారని యాదన్న అన్నారు.ఆసరా పెన్షన్లను పెంచుతున్నారని,వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు,రైతుబంధు కింద ఇచ్చే నిధులు పెంచాతామని ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టారని చెప్పారు.400 రూపాయలకే గ్యాస్ ఇవ్వనున్నట్లు కెసిఆర్ ప్రకటించారన్నారు.పేద కుటుంబాల పిల్లలకు కల్యాణ లక్ష్మి,షాదీముభారక్ అమలు చేశామన్నారు.కంటి వెలుగు ద్వారా వెలుతురు నిచ్చారన్నారు. రైతు బంధు,సీఎం ఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసుకున్నామని చెప్పారు.ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి తమ స్వలాభం కోసం లేని పోని పసలేని విమర్శలు చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ నేతలు కేవలం పదవులకోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజా క్షేమాన్ని కాదన్నారు.50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్ముతారాని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య  ప్రశ్నించారు.వాస్తావాలు చెప్పే వారి మాటలు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు.వచ్చే ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు.మాయ మాటలు ఎన్ని  చెప్పినా నాతోకలిసి వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు నాయకులు స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Leave a Reply