Take a fresh look at your lifestyle.

‌ప్రజాతంత్ర వార్తకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ‌స్పందన

కందుకూర్‌ ఆర్‌డీవోకు విచారణ నివేదిక అందజేయాలని ఆదేశం

తహసీల్దార్‌ ‌కార్యాలయ సిబ్బందితో సమీక్ష…
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
సర్వేయర్‌కు మేమో జారి చేయాలని ఆదేశం
మీసేవా సెంటర్‌ను తనిఖీ చేసిన ఆర్‌డీవో..బినామి పరార్‌

రంగారెడ్డి జాల్లా కలెక్టర్‌ అమోయ్‌ ‌కుమార్‌ ఆదేశానుసారం ఆమనగల్లు తహసీల్దార్‌ ‌కార్యాలయాన్ని శనివారం కందుకూర్‌ ఇం‌చార్జ్ ఆర్‌డీఓ ఈ. వెంకటాచారి తనిఖీ చేశారు. ఈ నెల 20వ తేదిన ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక మెయిన్‌ ఎడిషన్‌లో ‘అవినీతికి నిలయం..ఆమనగల్లు తహసీల్దార్‌ ‌కార్యాలయం ….!’ అనే శీర్షికన వార్త కథనం ప్రచురితమైంది. ఈ వార్తా కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఇ‌బ్రాహింపట్నం ఆర్‌డీవో ఈ. వెంకటాచారిని సమగ్రమైన విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆర్‌డీవో ఆమనగల్లు తహసీల్దార్‌ ‌కార్యాలయానికి వొచ్చి ప్రజాతంత్ర దినపత్రికలో వొచ్చిన వార్త కథనంపై డిప్యూటీ తహసీల్దార్‌ ‌మనోహర్‌ ‌రావు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rangareddy District Collector responds to prajatantra news

బాధితులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సేవలందించి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. రాంనుంతల గ్రామ శివారు సర్వే నంబరు 64 ఆ3లో 1-18 గుంటలకు గాను మిగితా 18 గుంటలకు సర్వే నిర్వహించాలని ఇంచార్జ్ ‌తహసీల్దార్‌ ‌మనోహర్‌రావుకు ఆదేశించారు.

బాధితురాలు కమ్లి తనకు రావాలసిన వ్యవసాయ భూమికి సంబంధించి  2019 సంవత్సరంలో సర్వే నిర్వహించాలని మీసేవాలో టీపన్‌ ‌ఛాలన్‌ ‌కట్టినా ఇంత వరకు సర్వే నిర్వహించక పోవడంపై ఆర్‌డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సర్వేయర్‌కు నోటీసులు జారిచేయాలని ఆదేశించారు. బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ ‌కార్యాలయం పక్కనున్న కిశోర్‌ ‌కమ్యూనికేషన్‌ ‌మీ సేవా సెంటర్‌ను ఆర్‌డీవో తనిఖీ చేశారు. పేరు ఒకరిది.. మీసేవా నిర్వహించేది మరొకరని తెలుసుకున్నారు. అక్కడ ఉన్న బినామి పరార్‌ ‌కావడంతో మీసేవలో పని చేస్తున్న బాలుడిని ప్రశ్నించారు. మీసేవా లో ఏ సేవకు ఎంత డబ్బులు తీసుకుంటున్నారని అడిగి విచారించి వారితో సంతకాలు తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో వెంకటాచారి ప్రజాతంత్ర విలేఖరితో మాట్లాడుతూ పత్రికలో వొచ్చిన వార్తలపై సమగ్రమైన విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానని వివరించారు.

Leave a Reply