Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో చెలరేగిన హింస ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

Ongoing riots in northeast Delhi

  • 135 మందికిపైగా తీవ్రగాయాలు
  • గాయపడిన ఇద్దరు జర్నలిస్టుల పరిస్థితి విషమం
  •  కేంద్రంమంత్రి అమిత్‌షా అత్యవసర సమీక్ష
  • సరిహద్దులను మూసేయాలన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
  • ‌పలు ప్రాంతాల్లో 144సెక్షన్‌ ‌పొడిగింపు
  • మెట్రోస్టేషన్ల మూసివేత
  • సైన్యాన్ని రంగంలోకి దింపాలన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ విషయమై గత మూడు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 10కి చేరింది. భజన్‌ ‌పూరాలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లు మూసి వేశారు. ఈ ఘటనల్లో 135మందికిపైగా గాయపడ్డా•రు. వారిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమంగా ఉంది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఆందోళన కారుల రాళ్ల దాడులు, దుకాణాల విధ్వంసం, పోలీసుల లాఠీ చార్జి కొనసాగుతున్నాయి. దుకాణాలు, టైర్లు తగలబెట్టడంతో పలు ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. పరస్పర దాడుల్లో వందల మందికి గాయాలు అయ్యాయి. అల్లర్లను అదుపు చేయాలంలో ఆర్మీని రప్పించాలని సీఎం కేజీవ్రాల్‌ ‌కోరుతున్నారు. ప్రధానంగా జఫరాబాద్‌, ‌మౌజ్‌ ‌పూర్‌, ‌చాంద్‌ ‌బాగ్‌, ‌ఖురేజీ ఖాస్‌, ‌భజన్‌ ‌పురా ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య దాడులు సాగుతున్నాయి.

Amit Shah's review of Delhi violence

ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలను మోహరించినా హింసాత్మక ఘటనలు పూర్తిగా అదుపులోకి రాలేదు. మంగళవారం కూడా ఈశాన్య దిల్లీలోని పలు చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయి రాళ్లు రువ్వు కున్నారు. దీంతో ఈశాన్య దిల్లీలో విధించిన 144 సెక్షన్‌ను మరో నెల రోజుల పాటు అంటే మార్చి 24 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హింసాకాండలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. మృతులలో ఓ కానిస్టేబుల్‌ ‌కూడా ఉన్నాడు. ఒక డీసీపీ స్థాయి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. బ్రహ్మపురి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్‌ఏఎఫ్‌ ‌దళాలకు ఆందోళనకారులు వాడిన బుల్లెట్లు లభించాయి. ఇదిలావుండగాఢిల్లీలోని పరిస్థితులను కేంద్రంశాఖ మంత్రి అమిత్‌షా ఉన్నతస్థాయి సమావేశం సక్షించారు. ఇందుకోసం దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ అనిల్‌ ‌బైజాల్‌, ‌ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌తదితరు)తో కీలక భేటీ నిర్వహించారు.భేటీలో దిల్లీ పోలీస్‌ ‌కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌, ‌కాంగ్రెస్‌ ‌నేత సుభాష్‌ ‌చోప్రా, భాజపా నేత మనోజ్‌ ‌తివారీ తదితరులు కూడా పాల్గొన్నారు. దిల్లీలో సోమవారం నుంచి జరిగిన హింసలో ఇప్పటివరకు ఓ హెడ్‌ ‌కానిస్టేబుల్‌తోపాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుల సంఖ్య తక్కువగా ఉన్నదని సీఎం కేజీవ్రాల్‌ ‌చెప్పడంతో మరిన్ని పోలీసు బలగాలను పంపాలని కేంద్ర •ంశాఖ నిర్ణయించింది. బ్రహ్మపురి, చాంద్‌పూర్‌, ‌కార్వాల్‌నగర్‌, ‌మౌజ్‌పూర్‌ ‌సహా పలు ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు.

అందరూ సంయమనం పాటించాలి: కేజ్రీవాల్‌
‌ఢిల్లీలో హింస ఆగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ అన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. వరుసగా మూడవ రోజు కూడా అల్లర్లు చోటుచేసుకోవడంతో అమిత్‌షాతో భేటీకి ముందు ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇతర ప్రాంతాలవారు ఈ పరిస్థితుల్లో రాజధానికి రాకుండా చూడాలని అన్నారు. ఇందుకోసం దిల్లీ సరిహద్దు ప్రాంతాలను మూసివేయాలని అధికారులకు సూచించారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో అనేక మంది పోలీసులు, పౌరులు కూడా గాయపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఘర్షణల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సంఖ్యాబలం తక్కువగా ఉన్నట్లు కేజీ తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా జఫ్రాబాద్‌, ‌సీలంపూర్‌లలో ముస్లిం మహిళలు ధర్నా కొనసాగిస్తున్నారు. అల్లర్ల వల్ల. అయిదు పింక్‌ ‌లైన్‌ ‌మెట్రో స్టేషన్లను మూసివేశారు.

కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్టు
ఈశాన్య దిల్లీలో సోమవారం కాల్పులు జరిపిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతడిని షాదార ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల షారుఖ్‌గా గుర్తించారు. ‘జఫ్రాబాద్‌ ‌ప్రాంతంలో ఎరుపు రంగు టీషర్ట్ ‌ధరించిన ఓ వ్యక్తి ఆందోళకారుల మధ్య నుంచి వచ్చి మరో వైపున ఆందోళ చేస్తున్న వారిపై కాల్పులు జరిపి తిరిగి గుంపులో కలిసిపోయాడు. అంతేకాకుండా అతడిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై తుపాకీ గురిపెట్టి నెట్టివేశాడు’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి షారుఖ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అతడి ద ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఢిల్లీ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితం: ఎంఐఎం ఎంపీ ఒవైసీ
‌ఢిల్లీ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమేనని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ట్రంప్‌ ‌పర్యటనకు ముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇవి మత విద్వేషాలు కావని.. రాళ్లు రువ్వమని పోలీసులే రెచ్చగొడుతున్నారని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే స్థానిక డీసీపీతో కలిసి దాడులకు ప్రోత్సహిస్తున్నారన్నారు. జామియా, జేఎన్‌యూ.. ఎక్కడ చూసినా దాడులే చేస్తున్నారన్నారని.. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.

సైన్యాన్ని రంగంలోకి దించాలి.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
ఈ హింసపై బీజేపీ సీనియర్‌ ‌నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. సీఏఏ వ్యతిరేక హింసను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవాలని, ఈ దిశగా కేంద్ర •ంమంత్రి అమిత్‌ ‌షాకు రక్షణ మంత్రి రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌ ‌సలహా ఇవ్వాలని సూచించారు. అల్లర్ల వల్ల దేశంలో అహింస మరింత చెలరేగుతుందని.. అసాంఘిక శక్తులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అల్లర్ల అణచివేతకు సైన్యాన్ని రంగంలోకి దింపడం ప్రజాస్వామ్య సంప్రదాయ పరంగా తీవ్ర చర్యే అయినా, హింసను రూపుమాపి ముఖ్యంగా ప్రజాస్వామ్యం కొనసాగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. గత 35 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇప్పుడిలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ అల్లర్లపై సుప్రీమ్‌కోర్టుకు..
పిటిషన్లు దాఖలు చేసిన చంద్రశేఖర్‌ ఆజాద్‌,‌హబీబుల్లా,అబ్బాస్‌
Justice Bhanumathi, who fell ill in the court hall
‌ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనల అంశాన్ని మంగళవారం సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీన్ని వెంటనే విచారణకు స్వీకరించాలని భీమ్‌ ఆర్మీ చీఫ్‌ ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌మాజీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ‌కమిషనర్‌ ‌వజాహత్‌ ‌హబీబుల్లా, సామాజిక కార్యకర్త బహదూర్‌ అబ్బాస్‌ ‌నక్వీ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. వెంటనే నిందితుల్ని గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఎస్‌.‌కె.కౌల్‌, ‌కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారిస్తామని స్పష్టం చేసింది. షాహీన్‌బాగ్‌ ఆం‌దోళన వ్యాజ్యాన్ని విచారించే సమయంలోనే తాజా హింసాత్మక ఘటనలపై కూడా వాదనలు వింటామని తెలిపింది. మరోవైపు సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలావుంటే ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, మద్దతుదారుల ఆందోళనలలో కాల్పులు జరిపిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడిని షాదార ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల షారుఖ్‌గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి షారుఖ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అతడి ద ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

error: Content is protected !!