Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

నమస్తే తెలంగాణ ఎండి దామోదర్‌రావు, హెటిరో సంస్థ ఛైర్మన్‌ ‌పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను ప్రకటించిన సిఎం కెసిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ ‌రావు, హెటిరో ఛైర్మన్‌ ‌డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి(వద్దిరాజు రవిచంద్ర) పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌ప్రకటించారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ ‌ప్రకటించింది.

- Advertisement -

తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే. కాగా, ఇందులో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19తో గడువు ముగుస్తుంది. మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 24న జారీ కానుంది.

Leave a Reply