Take a fresh look at your lifestyle.

ఆరోగ్య సంరక్షణ కోసం 2 లక్షల కోట్లు ఆర్థిక బడ్జెట్ 2021-22 లో కేటాయింపు

ఈ ఏడాది బడ్జెట్ 2021 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి కోవిడ్ -19 తరవాత కరోనా లాక్‌డౌన్ ప్రభావాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్న సమయంలో వచ్చిన కేంద్ర బడ్జెట్ (2021-22) ఇది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సమర్పించిన  తన బడ్జెట్ ప్రసంగంలో, సీతారామన్ ఆరోగ్య సంరక్షణ కోసం 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం 35,000 కోట్ల రూపాయలు, రైల్వేలకు 1.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఈ సంవత్సరం మొత్తంలో దేశవ్యాప్తంగా 11,000 కిలోమీటర్ల జాతీయ రహదారి మౌలిక సదుపాయాల (ఇంఫ్రాట్రక్చర్ ప్రాజెక్ట్ లు) పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పారు.

Leave a Reply