Take a fresh look at your lifestyle.

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి హరీష్‌ ‌రావు ఆకస్మిక తనిఖీ

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు ఆకస్మికంగా తనిఖీ చేసిన చేశారు.కలెక్టర్‌ ‌కార్యాలయంలోని పలు సెక్షన్‌ ‌లను పరిశీలించారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌ ‌కు వచ్చిన మంత్రి కలెక్టరేట్‌ ‌లోని అన్ని విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదిన్నర అవుతున్నా సిబ్బంది విధులకు ఎందుకు హజరుకాలేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు.

- Advertisement -

సమయపాలన విధిగా పాటించాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మంత్రి వెంట ఏమెల్సీలు భూపాల్‌ ‌రెడ్డి, రఘోత్తం రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌రాజర్షి షా, డిఅర్‌ఓ ‌రాధికా రమణి పాల్గొన్నారు.

Leave a Reply