Take a fresh look at your lifestyle.

మరణ శిక్షలే కఠిన శిక్షలా..?

Death Penaltyలైంగిక దాడులకు పాల్పడిన వారికి ఈ మధ్య కాలంలో ఉరిశిక్షలను ఎక్కువగా విధిస్తున్నారు. అత్యాచారాల కేసుల్లో నిందితులను ఉరితీయాలంటూ  ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడమే కాకుండా  పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.  ప్రజాగ్రహాన్ని చల్లార్చడంతో పాటు వారి డిమాండ్‌ ‌ను మన్నించినట్టు ఉంటుందని కాబోలు ఇలాంటి కేసుల్లో నిందితులకు కోర్టులు ఉరి శిక్షలు విధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించిన     నిర్భయ కేసులో ముద్దాయులు నలుగురికి   ఫిబ్రవరి ఒకటవ తేదీన అమలు జరగాల్సిన ఉరి శిక్ష వాయిదా పడింది. మన దేశంలో ఉరిశిక్షలను అరుదైన సందర్భాలలో మాత్రమే అమలు  జేసే ఆనవాయితీ ఉంది. నిర్భయ కేసులో ముద్దాయిల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి రామనాథ్‌ ‌కోవింద్‌ ‌తిరస్కరించారు.  2004  తర్వాత మన దేశంలో  నాలుగు ఉరి శిక్షలు మాత్రమే అమలు జరిగాయి.  వీటిలో ముగ్గురు ఉగ్రవాద కేసుల్లో శిక్ష పడిన  వారు కాగా మరొకరు   చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు.  నిర్భయ్‌ ‌కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని అప్పట్లోనే కాకుండా ఇప్పటికీ మహిళా సంఘాలు డిమాండ్‌ ‌చేయడాన్ని చూస్తున్నాం. 2018లో 186 మందికి న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధించాయి. 2017లో 121 మందికి ఉరి శిక్షలు విధించారు. అంటే ఒక్క ఏడాదిలోనే 53 శాతం పెరిగాయన్న మాట. ఈ లెక్కలు జాతీయ నేర రికార్డుల బ్యూరో అందించినవి. 2018లో 40 శాతం మందికి పైగా ఉరిశిక్షలు పడగా, 2019లో 52,19 శాతం మందికి ఉరిశిక్షలు అమలు జరిగాయి.

అయితే, ఈ  పద్దతి వల్ల లైంగిక హింసలు, అత్యాచారాలు తగ్గక పోగా మరింత పెరుగుతున్నాయని పరిశోధకురాలు, న్యాయవాదిని వృందా  గ్రోవర్‌ అన్నారు. లైంగిక దాడుల నుంచి పిల్లలను రక్షించడానికి ఉదేశించిన చట్టంలో 2012లో మార్పులు చేశారు. అలాగే, ఇటీవల వెటర్నరీడాక్టర్‌ ‌దిశ హత్య కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలన్న డిమాండ్‌ ‌వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చింది. యావజ్జీవ ఖైదు కన్నా మరణ శిక్ష కఠినమైనదని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని 2015లో లా కమిషన్‌ ‌స్పష్టం చేసింది. 2012లో ఢిల్లీలో జ్యోతి సింగ్‌పై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు  మరణశిక్ష విధించాలన్న డిమాండ్‌ ‌వచ్చింది. దీంతో 2013లో క్రిమినల్‌లా( సవరణ) చట్టం వచ్చింది. యాసిడ్‌ ‌దాడులు, లైంగిక వేధింపులను ఈ చట్టం కిందికి తెచ్చారు.     2019లో  ఇండియా స్పెండ్‌ అధ్యయనం ప్రకారం లైంగిక దాడుల కేసుల్లో శిక్షల ప్రభావం ఏ ఉండటం లేదు. 2007లో అతి తక్కువగా 18.9 శాతం, 2006లో 27 శాతం నమోదు అయింది. విచారణ కోర్టులు 2019లో 102 ఉరి శిక్షలు విధించాయి.

అంతకుముందు సంవత్సరం 162  శిక్షలు విధించాయి. 102 ఉరిశిక్షల్లో 54 శిక్షలు హత్యలు, లైంగిక వేధింపులకు సంబంధించినవే. అత్యాచారానికి గురి అయిన వారు ఫిర్యాదులు చేయడం తక్కువ. 99.1 కేసుల్లో బాధితులు ఫిర్యాదులు చేయలేదు. మరణశిక్షే అతి పెద్ద శిక్ష అనే భావనను తొలగించాల్సిన అవసరం ఉందని    ప్రాజెక్టు  39-ఏ  ఎగ్జిక్యూటివ్‌ ‌డైరక్టర్‌  అనూప్‌ ‌సురేంద్ర నాథ్‌ అన్నారు.  పోస్కో చట్టం కింద నమోదైన కేసుల విచారణ బాగా జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. రాష్చ్ర  ప్రభుత్వాలు ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులు ఏర్పాటు చేస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. చాలా కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు 56 మరణశిక్షలను, హైకోర్టులు ఏడు మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చాయి. కోర్టులకు తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా కేసుల సత్వరవిచారణకు ఆటంకం కలుగుతోంది.
‘‌స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply