Take a fresh look at your lifestyle.

బ్యాంకులకు వరుస సెలవులు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : ఈనెలలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్న నేపథ్యంలో ఖాతాదారులు అలర్ట్‌గా ఉండాలని ఆయా బ్యాంకులు పేర్కొంటున్నాయి. మార్చి 11 నుంచి 17 వరకు కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకు కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది. గురువారం శివరాత్రి సెలవు తరువాత ఒక్క రోజు బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతాయి. ఆ తరువాత 13న  రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు. ఆ తరువాత దేశవ్యాప్తంగా మార్చి 15,16 తేదీల్లో బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 9 ప్రధాన బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే,.. దీంతో ఆ రెండురోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చని స్టాక్‌ ఎక్స్‌చేంజిలకు స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా సమాచారం ఇచ్చింది. అలాగే రాబోయే వారం రోజుల్లో ఐదు రోజులు బ్యాంకింగ్‌ ‌సేవలకు అంతరాయం ఏర్పడనుంది. తిరిగి 17 నుంచి బ్యాంకులు యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. అందువల్ల ఆయా బ్యాంకుల ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా పనుల కోసం వెళ్లాలని అనుకుంటే ఈ సెలవులకు తగినట్లుగా ప్లాన్‌ ‌చేసుకోవడం మంచిదని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply