Take a fresh look at your lifestyle.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం
విజయవాడ,జూలై22 : కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో  డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద  పట్టిసీమ వరద నీరు కృష్ణా నదికి చేరింది.

దీంతో నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు పొంగిపొర్లడంతో నందిగామ, వీరులపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి.

భారీ వర్షాలకు మైలవరం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి విద్యుత్‌ ‌సరఫరాను అధికారులు నిలిపివేశారు.

Leave a Reply