Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి మద్దతు తెలిపిన వెంకటేశ్వర నగర్ సగర సంఘం, మున్నూరు కాపు సంఘం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర ,నవంబర్ 13: ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ మున్నూరు కాపు సంఘం, సగర సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి మద్దతు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మాజీ కార్పొరేటర్ రంగారావు ఆధ్వర్యంలో ఉప్పర సంఘం, మున్నూరు కాపు సంఘం సభ్యులు ప్రభుత్వ విప్ ఆరకపూడి గాంధీ వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం పత్రం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సగర సంఘం, మున్నూరు కాపు సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందని, అన్ని విధాలుగా అండగా ఉంటూ సహకరిస్తూ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో 9వేల కోట్ల రూపాయల నిధులతో శేర్లింగంపల్లి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో అమలుపరిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తాను తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ప్రజలతో నాయకులతో కార్యకర్తలతో సత్సంసంబందాలు కలిగి ఉన్నానని నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. నియోజకవర్గం పూర్తిస్థాయిలో తనకు అవగాహన ఉందని ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి  కృషి చేశానని మళ్లీ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అపరిస్కుతంగా ఉన్న వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పునరుద్గాటించారు. నియోజకవర్గ పరిధిలో తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను అత్యధిక మెజార్టీతో ముచ్చటగా మూడోసారి మళ్ళీ గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, నాయినేని చంద్రకాంత్, చంద్రారెడ్డి, మున్నూరు కాపు సంఘం సభ్యులు, జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ సగర సంఘం అధ్యక్షులు దయాసాగర్, ప్రధాన కార్యదర్శి ఆస్కాని శ్రీనివాస్ సాగర్, కోశాధికారి వేముల సుదర్శన్ సాగర్, కె.వి.రాముల సాగర్, రాము సాగర్, భీమయ్య సాగర్, రామకృష్ణ సాగర్, చంద్రమోహన్ సాగర్, తిరుపతమ్మ సాగర్, శాంతా సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply