Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా 2,392 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు


మరో 11మంది మృతితో 906కు చేరిన మరణాలు


  ‌గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,392 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,45,163కు చేరాయి. తాజాగా వైరస్‌తో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 906కు చేరింది. తాజాగా వైరస్‌ ‌నుంచి 2,346 మంది వైరస్‌ ‌నుంచి కొలుకోగా, మొత్తం 1,12,587 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 24,579 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.69గా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 77.5శాతంగా ఉందని పేర్కొంది. సోమవారం ఒకే రోజు 60,923 శాంపిల్స్ ‌పరీక్షించగా.. ఇప్పటి వరకు 18,27,905 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 1,606 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 49,234 మందికి టెస్టులు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.

తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌జీహెచ్‌ఎం‌సీ పరిదిలో 304 పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 191, కరీంనగర్‌లో 157, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరిలో 132, ఖమ్మంలో 116, నల్గొండలో 105, నిజామాబాద్‌లో 102, సూర్యపేటలో 101, భదాద్రి కొత్తగూడెంలో 95, వరంగల్‌ అర్బన్‌లో 91 పాజిటివ్‌ ‌కేసులు రికార్డయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,392 కరోనా కేసులు నమోదు కాగా.. 11 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,45,163 కొరోనా కేసులు నమోదు కాగా.. 906 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 31,670 యాక్టివ్‌ ‌కేసులుండగా.. చికిత్స పొంది 1,12,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 18,27,905 కొరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 77.5 శాతం ఉండగా.. మరణాల రేటు 0.62 శాతంగా ఉంది. కొత్తగా జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 304, రంగారెడ్డి 191, కరీంనగర్‌ 157, ‌మేడ్చల్‌ 132, ‌ఖమ్మం 116, నల్గొండ 105, నిజామాబాద్‌ 102, ‌సూర్యాపేట 101, భదాద్రి 95, వరంగల్‌ అర్బన్‌లో 91 కేసులు నమోదయ్యాయి.

Leave a Reply