నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
కొరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా సంవత్సరాన్ని తిరిగి ప్రారంభి •ంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను వచ్చేనెల 9, 10, 11, 14 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే, ఈనెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహించాలని భావిస్తోంది. అయితే, ఈ తేదీలను, పోటీ పరీక్షలను నిర్వహించే విధానాన్ని రూపొందించి దానిని హైకోర్టుకు సమర్పించిన తరువాత హైకోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించనుంది.
సోమవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో 2020 21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను హైకోర్టుకు తెలియజేసి, కోర్టు ఆమోదంతో అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించే విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్లో పరీక్షల నిర్వహణకు తేదీలను ఉన్నత విద్యా మండలి ద్వారా ఖరారు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇక ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.