Take a fresh look at your lifestyle.

ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమం, అప్రజాస్వా మికం, హేయమైన చర్య అని టీడీపీ నగర సీనియర్ నాయకులు డాక్టర్ నవీన్ వల్లం సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తనకు నచ్చిన వారు వివిధ కేసుల్లో నిందితులైనా వారిని అంద లమెక్కిస్తూ, గిట్టనివారు నిర్దోషులైనా అక్రమ అరె స్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, ఎలాంటి తప్పుచేయని చంద్రబాబుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు వైసిపి అధినేతలో పరాకాష్ఠకు చేరిన పైశాచికత్వానికి నిదర్శనమని విమర్శించారు. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్లో కుంభకోణానికి, చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని, తొలుత ఉన్నతాధికారులను బాధ్యులుగా చేసి అనంతరం ఆయన్ను విచారించి ఉండాల్సిందన్నారు. చంద్ర బాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నిర్వహించే ఆందోళనల్లో పాల్గొని సంఘీ భావం తెలుపుతానని పేర్కొన్నారు.

Leave a Reply