Take a fresh look at your lifestyle.

జిఎడి సెక్రటరీ స్వయంగా ఫోన్‌ ‌చేస్తే కాదంటారా

  • అధికారిక కమిటీ కాదని ఎలా అంటారు
  • నేడు మరోమారు చర్చలకు ఆహ్వానిస్తాం
  • అవసరమైతే క్రమశిక్షణ చర్యలకు వెనకాడం
  • స్పష్టం చేసిన మంత్రి బొత్స, సజ్జల

అమరావతి, జనవరి 24 : ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు వస్తే మా వైపు నుంచి చర్చలు జరిపేందుకు సిద్ధంగ ఉన్నామని సంప్రదింపుల కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా సమాచారం ఇచ్చామని అన్నారు. జీవోలను అభయన్స్‌లో పెట్టాలని కోరారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని వారు వెల్లడించారు. అయితే తాము మళ్లీ మంగళవారం కూడా చర్చల కోసం వస్తామని మంత్రులు పేర్కొన్నారు. మరోసారి చర్చలకు రావాల్సిందిగా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. జీఏడీ సెక్రటరీ ఫోన్‌ ‌చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని బొత్స, సజ్జల ప్రశ్నించారు. ఉద్యోగస్తులు కూడా మా ప్రభుత్వంలో భాగమేనని వారన్నారు. ఏ సీరియస్‌ ‌నిర్ణయం తీసుకోవద్దని ఉద్యోగులను రిక్వెస్ట్ ‌చేస్తున్నామన్నారు. పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల,బొత్సలు డియాతో మాట్లాడారు.

ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తామని అన్నారు. సమ్మె నోటీస్‌ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని బొత్స, సజ్జల తెలిపారు. ఈ కమిటీ ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు నిజమైన సమస్యలుంటే పరిష్కారానికి కృషి చేస్తుందని వారు అన్నారు. ట్రెజరీ ఉద్యోగులు మెడ ద కత్తి పెట్టడం వల్ల నోటీస్‌ ‌పీరియడ్‌కు అర్థం ఉండదని వారు వ్యాఖ్యానించారు. అలా చేస్తే ఉద్యోగులను ప్రభుత్వం క్రమశిక్షణలో పెట్టే పక్రియను ప్రారంభించాల్సి ఉంటుందని మంత్రులు సజ్జల, బొత్స తెలిపారు. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏం చేసిందో ప్రజలకు వివరించటం తప్పేలా అవుతుందన్నారు.

Leave a Reply