నేతాజీ సుభాష్ చంద్రబోస్, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద వంటి మహా వ్యక్తులతో ఒక నాడు ప్రసిద్ది చెందిన పశ్చిమ బెంగాల్ నేడు హింసాత్మక రాజకీయాలకు, రాజకీయ హత్యలకు పేరుపొందింది. 2021 లో బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరఫనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, పశ్చిమ బెంగాల్లో 27% ముస్లిం జనాభా ఉండగా ఇప్పుడది 30% కంటే ఎక్కువ పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో వారి జనాభా 70% కి దగ్గరగా ఉంది. మొత్తం 294 స్థానలకుగాను 100 స్థానాలలో ముస్లిం వోటర్లు అక్కువ ఉన్నారు. మమతా బెనర్జీ నేర్పుగా రాజకీయాలు చేస్తున్నారు.
మమతా బెనర్జీ సలహాదారు ప్రశాంత్ కిషోర్ అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీ రెండంకెల మార్కును దాటలేదు. అయితే ఆయన అంచనా చాలా సందర్భాలలో సత్యదూరమని అని రుజువు చేస్తుంది. ప్రశాంత్ కిషోర్, మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం జ్యోతిషశాస్త్రం, పండిట్ల సహాయం తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు స్థానం లేదు. ఎన్నికల కోణంలో ఉండటం, లేకపోవడం అనే అంశం రాష్ట్ర రాజకీయ గణాంకాలను ప్రభావితం చెయ్యదు. ప్రజాస్వామ్యం కంటే హింసను వామపక్షాలు ఎక్కువగా నమ్ముతాయని చాలామందిభావన.
అమిత్ షా, జెపి నడ్డా సమ్యుక్తంగా మమతా బెనర్జీ సాంప్రదాయ వోటు బ్యాంకులో శూన్యతను సృష్టించారు. ప్రశాంత్ కిషోర్ వలన తృణమూల్ కాంగ్రెస్‌లో అసంతృప్తి నెలకొంది. ప్రశాంత్ కిషోర్ జనతాదళ్ యునైటెడ్‌తో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ నాయకులలో ప్రశాంత్ కిషోర్ పట్ల అసంతృప్తి నెలకొంది. చాలా మంది నాయకులు తృణమూల్ కాంగ్రెస్ ను విడిచిపోతున్నారు. ప్రశాంత్ ఇప్పటికీ తనను తాను చాణక్యహుగా భావించి తప్పు చేస్తున్నాడు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే కాదు, పార్టీని చీలుస్తుంది. అత్యవసర పరిస్థితి తరువాత, 1977 నుండి 2011 వరకు, 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం ఉంది. 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి మమత వామపక్షాలను అధికారానికి దూరంగా ఉంచారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కూడా విజయం సాధ్యించారు.
పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మా, మాటి, మనుష్, ముగ్గురూ సురక్షితంగా లేరని మమత అన్నారు. ప్రభుత్వంపై కోపం ఉంది. ఇటీవల బెంగాల్ పర్యటనలో జెపి నడ్డా కాన్వాయ్‌పై దాడి జరగడం, శుభేందు అధికారి విడిచిపెట్టడం, బెంగాల్ లో హింసా రాజకీయాలను మమత పరిపాలనను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి సేవకుని రీతిలో పనిచేస్తున్నంత కాలం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్నిసొంత ఆస్తిగా భావిస్తే, వారి రాజకీయ పతనం ప్రారంభమైనట్లే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరు అధికారం నుండి తప్పుకుంటారు అనేది 2021 ఎన్నికలు చెబుతాయి. మమతా బెనర్జీ పదేళ్ల పాలన ముగిసిపోతుందా, ఆమె మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? తెలియదు కాని, ఆమె శిబిరంలో కోలాహలం తీరు గమనిస్తే పరిస్థితులు తృణమూల్ కు, ఆమెకు అనుకూలంగా మాత్రం లేవు.
contactprofviveksingh@gmail.
09152078747