Take a fresh look at your lifestyle.

గవర్నర్‌ ‌వ్యాఖ్యలు.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం

  • కొరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్‌ : ‌ట్విట్టర్‌లో ఉత్తమ్‌
  • ‌కేసీఆర్‌ ‌విలువలులేని వ్యక్తి : సిఎల్పీ నేత భట్టి
  • ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌లేదా ఆరోగ్యశ్రీలో కొరొనా చేర్చాలి : జీవన్‌ ‌రెడ్డి
  • సిఎస్‌కి గవర్నర్‌ అం‌టే కనీస గౌరవం లేదు : జగ్గారెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ‌ఫైర్‌

రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌వ్యాఖ్యలు కొరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతున్నాయని టీపీసిసి చీఫ్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సర్కార్‌పై మండిపడ్డారు. బుధవారం ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ….చిన్న రాష్ట్రాలు కూడా రోజుకు లక్షల్లో టెస్టులు చేస్తుంటే తెలంగాణలో ఈ నెల 17వ తేదీన చేసిన టెస్టులు కేవలం 19,579 మాత్రమేనని విమర్శించారు. కేసీఆర్‌ ‌తీరుతో రాష్ట్రం మరియు హైదరాబాద్‌ అభాసుపాలవుతున్నాయని అన్నారు. ఇక ఇదే అంశంపై సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..కొరోనా విజృంభిస్తుందని గవర్నర్‌ ‌ముందే గ్రహించి ప్రభుత్వానికి లేఖలు రాశారని, వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయండని హాస్పిటల్స్ ‌బెడ్స్ ‌పెంచాలని కూడా గవర్నర్‌ ‌కొన్ని నెలల క్రితమే లేఖలు రాశారని గుర్తు చేశారు. గవర్నర్‌ ‌సూచనలను టీఆరెస్‌ ‌ప్రభుత్వం బేఖాతర్‌ ‌చేయడం వల్ల రాష్ట్రం అంతా కొరోనా విజృంభించిందని విమర్శించారు. గవర్నర్‌ ‌ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తే గవర్నర్‌పై విమర్శలు చేయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, మీడియాపై ఎదురుదాడి చేసిందే కాక గవర్నర్‌ను సైతం ఎదురిస్తారా? అని మండిపడ్డారు.

టీఆరెస్‌ ‌ప్రభుత్వం రాజకీయ విలువలను బేఖాతర్‌ ‌చేస్తోందని విమర్శించారు. గవర్నర్‌ ‌ప్రభుత్వంపై విమర్శలు, సూచనలు చేస్తే విలువలు ఉన్న సీఎంలు గతంలో రాజీనామాలు చేశారని, రాజ్యాంగ విలువలు ఉన్న వ్యక్తి కేసీఆర్‌ అయితే రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ ‌చేశారు. కేసిఆర్‌ ‌విలువలు లేని వ్యక్తి అని, కనీసం గవర్నర్‌ ‌చెప్పిన సూచనలు అయినా అమలు చేయాలని కోరారు. గవర్నర్‌ ‌తన వ్యాఖ్యలను మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వాన్ని అదేశించి ఆచరణలో పెట్టించాలని అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సీఎం గవర్నర్‌ ‌కి క్షమాపణ చెప్పాలన్నారు. మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…కొరోనా విషయంలో న్యాయస్థానం పలు సార్లు ప్రభుత్వాన్ని చురకలు అంటించిందని హైకోర్టు హెచ్చరికలతో కొరొనా టెస్టులు పెంచుతామని చెప్పి కనీసం సగం కూడా చేయడం లేదని ఆరోపించారు. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌పై వైద్యమంత్రి హెచ్చరికలు తాటాకు చప్పుళ్లకు మాత్రమే పరిమితం అఅవష్ట్రఅఅని  విమర్శించారు. కనీసం కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌లేదా ఆరోగ్యశ్రీలో కొరోనాను చేర్చాలని డిమాండ్‌ ‌చేశారు.

సిఎస్‌కి గవర్నర్‌ అం‌టే కనీస గౌరవంలేదు : జగ్గారెడ్డి
ఎంఎల్‌ఏ ‌జగ్గారెడ్డి మాట్లాడుతూ..గత అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్‌ ‌కొరోనాపై మాట్లాడితే సిఎం కేసీఆర్‌ ‌వ్యంగంగా మాట్లాడారని, ఒక టాబ్లెట్‌ ‌వేసుకుంటే కొరోనా పోతుందని వ్యాఖ్యానించారని తెలిపారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి సెటైర్లు వేశారని విమర్శించారు. సిఎంకు గవర్నర్‌ అం‌టే కనీస గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సైతం రాహుల్‌ ‌గాంధీ చెప్పిన నెల రోజుల తర్వాత స్పందించారని గుర్తు చేశారు.

కొడుకుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి సిఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ.
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కొడుకు కేటీఆర్‌పై ఉన్న ప్రేమ రైతులపై లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. బుధవారం రేవంత్‌ ‌రెడ్డి, సిఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో అకాల వర్షాలు, పంట నష్టం- రైతుల కష్టం గురించి రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వర్షం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ ‌చేశారు. తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వెయ్యాలని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 20వేల పరిహారం చెల్లించాలన్నారు. పంట నష్టానికి వెంటనే తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు విడుదల చెయ్యాలని, పంట నష్టం జరిగిన రైతులు మళ్ళీ పంటలు వేసుకోవడానికి విత్తనాలు అందుబాటులోకి తేవాలని అన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని ఈ సమస్యను సైతం వెంటనే తీర్చాలన్నారు. రాష్ట్రంలో ఫసల్‌ ‌బీమా పథకం అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయాలని సూచించారు. వర్షం కారణంగా అస్తవ్యస్థ్ఠంగా మారిన భూములను బాగు చేసుకోవడానికి ఎకరానికి 5వేలు ఆర్థిక సాయం చేయాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply