Take a fresh look at your lifestyle.

బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపి ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. అన్నీ పార్టీలు బిసిలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బిసి సంఘాల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బిజెపి బీసీ సీఎం ప్రకటించడం గర్వకారణం, కానీ మిగతా పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు బీసీలను గుర్తించకపోవడం శోచనీయం అన్నారు. సమర్ధులైన బీసీ నాయకులు ఉన్నప్పటికీ వారికి టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశారన్నారు. బిఆర్ఎస్ కేవలం 23 సీట్లు కేటాయించి అన్యాయం చేసిందన్నారు. బీసీలు గగ్గోలు పెడుతుంటే ఇంకోకా అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ 20 సీట్లు కేటాయించి అన్యాయం చేయడం లో పోటీ పడిందన్నారు. బీసీలు ఈ పార్టీలకు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. నిజంగా బిజెపి పార్టీ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు పార్లమెంటులో పెట్టాలన్నారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ఏటా రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్, బీసీ యువజన సంఘం కన్వీనర్ టి.రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పగిడాల సుధాకర్, నాయకులు నందగోపాల్, దీపిక, శ్రీనివాస్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply