Take a fresh look at your lifestyle.

నేడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంటిగ్‌

  • కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ‌కళాశాలలో ఏర్పాట్లు పూర్తి
  • భారీ బందోబస్తు మధ్య ఉదయం నుంచి వోట్ల లెక్కింపు
  • రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే…ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ
  • ఈవీఎం, వివిప్యాట్స్ ‌తరలింపుపై ఇంకా కొనసాగుతున్న వివాదాలు

రాష్ట్ర ప్రజలు, ఒకింత దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం నేడు తేలనుంది. వోట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ‌డిగ్రీ కాలేజీలో వోట్ల లెక్కింపు చేపడతారు. ఈ పక్రియను ఎలాంటి పొరపాట్లు, వివాదాలకు తావులేకుండా, సజావుగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ ‌గోయల్‌ ‌కోరారు. జిల్లా కలెక్టర్‌ ‌కర్ణన్‌ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈవీఎంలలో నిక్షప్తమై ఉన్న ఫలితం నేటి మధ్యాహ్నం కల్లా తేలనుంది.

ఇకపోతే కాంగ్రెస్‌ ‌కూడా పోటీలో ఉన్నా ప్రధానంగా టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు వొడ్డాయి. సుధీర్ఘ కాలం దాదాపు మూడు, నాలుగు నెలల పాటు తమ పరస్పరం తీవ్ర స్థాయిలో దూషించుకున్నాయి. దేన్ని వొదిలి పెట్టకుండా ఒకరినొకరు దెబ్బకొట్టడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం తప్పనిసరిగా రాష్ట్రంలో భవిష్యత్‌ ‌రాజకాయాలపై ప్రభావం చూపుతుంది. నేటి ఫలితంపై కెసిఆర్‌ ‌ఛరిష్మా లేదా ప్రజలకు ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని  కొంత వరకు తెలుస్తుంది. కెసిఆర్‌ ‌వ్యూహం ఫలించి టిఆర్‌ఎస్‌ ‌గెలిస్తే ఆయనకు తిరుగు ఉండదు.

లేకుంటే కొంత నష్టం తప్పదు. అలాగే ఈటల రాజకీయ భవిష్యత్‌ ‌కూడా తేలిపోనుంది. ఈటల గెలిస్తేనే రాజకీయంగా నిలబడి టిఆర్‌ఎస్‌ను ఎదుర్కునగలుగుతారు. బిజెపి కూడా కొంత బలం పెరుగుతుంది. రాబోయే ఎన్నికలలో టిఆర్‌ఎస్‌పై పోరాడేందుకు అవకావం ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు జరిగినా కేవలం హుజూరాబాద్‌పైనే ప్రజలంతా దృష్టి పెట్టారు.

ఈవీఎం, వివిప్యాట్స్ ‌తరలింపుపై ఇంకా కొనసాగుతున్న వివాదాలు
మరోవైపు పోలింగ్‌ ‌ముగిసినా వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎన్ని మార్గదర్శక సూత్రాలు జారీచేసినా అవేవి ఇక్కడ అమలు కాలేదనే ఆరోపణలు వొస్తున్నాయి. ఈవీఎంలు, వీవీప్యాట్స్ ‌తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పోలింగ్‌ ‌మగిసేంత వరకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తూ పోలింగ్‌ ‌కేంద్రాలకు సవి•పంలోనే పోలీసు పహారా ఉన్నా పోలింగ్‌ ‌స్లిప్పులతోపాటు వెయ్యి రూపాయల చొప్పున వోటర్లకు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అధికార యంత్రాంగం మాత్రం పోలింగ్‌ ‌పక్రియ ప్రశాంతంగా జరిగిందని, 86.64శాతం ప్రజలు తమ వోటు హక్కును వినియోగించుకున్నారని ప్రకటించింది. ఎన్నికల పక్రియలో అధికార యంత్రాంగంపై భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు అధికారపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు చేసింది. ఉన్నతాధికారులు ఆ విమర్శలను ఖండించారు.  శనివారం పోలింగ్‌ ‌ముగిసిన తర్వాత హుజురాబాద్‌ ‌నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి పోలీసు బందోబస్తు మధ్య బస్సుల్లో ఈవీఎంలను, వీవీపాట్స్‌ను తరలిస్తుండగా ఆ బస్సులను సుమారు గంటగంటన్నరకు పైగా రోడ్డుపైనే నిలిపేశారు. బస్సు పంక్చర్‌ అయిందని కొందరు, రిపేర్‌కు వొచ్చిందని కొందరు కారణాలు చెబుతున్నా బీజేపీ నాయకులు మాత్రం టీఆర్‌ఎస్‌ ‌చెందిన ఒక నాయకుడి హోటల్‌ ఎదుట బస్సులను గంటసేపు నిలపడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ తర్వాత బస్సులు కరీంనగర్‌ ఎస్సారార్‌ ‌కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ ‌కేంద్రంలోని స్ట్రాంగ్‌ ‌రూమ్‌ ‌వద్దకు చేరుకున్నాయి. ఈ మొత్తం క్రమంపై సిబిఐ విచారణ జరపాలని బిజెపి డిమాండ్‌ ‌చేస్తుంది. ఇకపోతే ఎస్సారార్‌ ‌ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని కౌంటింగ్‌ ‌కేంద్రంలో ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్‌ ‌శంకర్‌ ‌నారాయణతో కలిసి సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని పోలింగ్‌ ‌కేంద్రాల్లో వోటింగ్‌ ‌సరళి, వోటింగ్‌ ‌శాతంపై అభ్యర్థులకు వివరించారు. మాక్‌ ‌పోలింగ్‌, ‌పీవో డైరీ, ఏఎస్‌డీ వోటర్లు, బ్యాలెట్‌ ‌యూనిట్లు, కంట్రోల్‌ ‌యూనిట్లు, వీవీ ప్యాట్లు, పోస్టల్‌ ‌బ్యాలెట్లు, సర్వీస్‌ ‌వోట్లు, తదితర అంశాలపై అభ్యర్థులకు వివరించారు.

మరోవైపు సోషల్‌ ‌వి•డియాలో వచ్చే పుకార్లను నమ్మకూడదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో సీహెచ్‌ ‌రవిందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏదేమైన నేడు మధ్యాహ్నానికి వెలువడే ఫలితంతో ఇరు పార్టీల అభ్యర్థుల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర రాజకీయ భవిష్యత్‌ ‌సమీకరణాల నిరేశించబడనున్నాయి.

Leave a Reply