Take a fresh look at your lifestyle.

రక్షా బంధన్ కానుక వంట గ్యాస్ ధరల తగ్గింపు శుభ పరిణామంఅందెల శ్రీ రాములు యాదవ్

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు రక్షా బంధన్ కానుకగా  భారీగా వంట గ్యాస్ ధరలను తగ్గించడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంఛార్జి అందెల శ్రీ రాములు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపును స్వాగతిస్తూ.. బుధవారం బీజేపీ బిఏంసి అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి అధ్వర్యంలో బడంగ్ పేట్ పాత గ్రామ పంచాయితీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందెల శ్రీ రాములు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, మహిళలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రా పటానికి పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అందెల శ్రీ రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నడు లేని విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రక్షా బంధన్ కానుకగా పెద్ద ఎత్తున వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించి, మహిళలకు భారీ కానుక ఇచ్చారని కొనియాడారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి రూ.400 వందలు, సాధారణ కనెక్షన్ తీసుకున్న వారికి రూ.200 వందల చొప్పున ప్రతి సిలిండర్ పై తగ్గించినట్లు చెప్పారు.మోడీ తొమ్మిదేళ్ళ కాలంలో దాదాపు తొమ్మిది కోట్ల పైచిలుకు కొత్త కనెక్షన్లు ఇవ్వటమే కాకుండా బుకింగ్ చేసుకున్న వెంటనే సిలిండర్ అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం సంక్షేమాన్ని అట్టడుగు స్థాయి వరకు తీసుకుపోతూ.. ప్రతి ఒక్కరి ప్రగతికి పాటు పడుతున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రతి ఒక్కరి వికాసానికి కృషి చేస్తుంటే, బిఆర్ఎస్ ప్రభుత్వం దిక్కుమాలిన మద్యం పాలసీ తీసుకువచ్చి, గ్రామ గ్రామాన, గల్లీ గల్లీలో, బెల్ట్ షాపులు తెరిపించి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతూ.. పేద ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లూటీ చేస్తుందని మండిపడ్డారు. సిలిండర్ ధర పది, ఇరువై రూపాయలు పెంచితెనే కట్టెల మోపుతో నిరసన తెలిపిన మంత్రి  పి.సబితా ఇంద్రా రెడ్డి ఇప్పుడు ఏమి మాట్లాడుతారని నిలదీశారు. పేద, మధ్య తరగతి మహిళల పాలిట శాపంగా మారిన మద్యం అమ్మకాల గురించి మంత్రి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వానికి ధనాపేక్ష తప్ప పేద ప్రజల సంక్షేమం పట్టాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వంట గ్యాస్ ధరలను తగ్గించి మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిచో మహిళలు బిఆర్ఎస్ కు తగిన బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు సామ సంజీవరెడ్డి, గుర్రం మల్లారెడ్డి, ఏనుగు రామ్ రెడ్డి, గడ్డం వెంకటేష్, తోట శ్రీధర్ రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, గూడెపు ఇంద్రసేన, జోరాల ప్రభాకర్, ఆర్.రామకృష్ణారెడ్డి, పేరమోని నరేష్, వరికుప్పల వెంకటేష్, చిత్రం శీను, జక్కిడి జంగారెడ్డి, మహిళా నాయకురాలు నివేదిత, చించేట్టి మమత, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి, జెనగె పద్మ ఐలయ్య, గౌర రమాదేవి శ్రీనివాస్, అర్చన, కావ్య మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply