Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 729 మందికి పాజిటివ్‌..ఐదుగురు మృతి
రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 729 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 772 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఐదుగురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 71 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 65 కేసులు, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో 53 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,36,049 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,756కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,22,313 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 9,980గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply