Take a fresh look at your lifestyle.

హోం క్వారంటైన్‌ను పాటించండి

మధిర పట్టణంలోని ఐశ్వర్య అపార్టెమెంట్‌ ‌నందు ఉన్న కుటుంబాలు హోం క్వారంటైన్‌లో ఉండాలని తహశీల్దార్‌, ఇన్‌చార్జి కమీషనర్‌ ‌డి.సైదులు, టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌, ‌డాక్టర్లు శ్రీనివాస్‌, ‌శశిధర్‌లు సూచించారు. జిల్లా కలెక్టర్‌, ‌జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు మే 28 నుండి జూన్‌ 10‌వ తేదీ వరకు హోం క్వారంటైన్‌ ‌పాటించాలని, కరోనా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు.

అపార్టెమెంట్‌లో కరోనా పాజిటివ్‌ ‌వ్యక్తి కుటుంబంతో పాటు రెడిమెడ్‌, ‌చెప్పుల షాపుల్లో పనిచేసే వర్కర్లతో సహా మొత్తం 60మందిని హోం క్వారంటైన్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డోర్‌ ‌స్టిక్కరింగ్‌, ఇం‌టింటా ఆరోగ్య తనిఖీ, హైపోక్లోరిడ్‌ ‌ద్రావణం పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఐసిడిఎస్‌ ‌సిబ్బంది, మెప్మా, పోలీస్‌, ‌రెవెన్యూ, సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!