Take a fresh look at your lifestyle.

విజ్ఞాన గని ‘‘మోక్షగుండం’’

నేడు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం

ఎన్నో దేశాలు ప్రపంచంలో అభివృ ద్దిలో ముందుకు దూసుకు పోతున్నాయి.అక్కడ ప్రజల జీవన ప్రమా ణాలు కూడా అత్యున్నత స్థా యిలో ఉంటు న్నా యి. ప్రతిభను ప్రోత్స హించడం వలన  ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి.
ప్రతిభను గుర్తించి గౌరవించడం  భారతీయ సంస్కృతి లోనే ఇమిడి ఉంది. నాటి కాలంలో తినడానికి తిండి లేక, చదవడానికి స్థోమత లేక వీధి అరుగులు విద్యాలయాలై…చెట్ల నీడలే  చెలిమికి చిహ్నాలై…గుడ్డి దీపాలే జ్ఞాన జ్యోతులై  కొడిగట్టే జీవితాల్లో కొండంత ఆశను నింపాయి. విజ్ఞాన తృష్ణ కు హారతి పట్టాయి. పేద,ధనిక తారతమ్యం ఇప్పటిలా  అప్పటి సమాజంలో  కూడా  వ్రేళ్ళూనుకుపోయింది. అయితే విద్యను, విద్యావంతులను ప్రోత్సహించడం లోను, ప్రతిభను గుర్తించడం లోను నాటి సమాజం  ఎంతో ముందంజ లో ఉండేది. ప్రతిభను బలవంతంగా అణచివేసే సాహసం ఎవరూ చేయలేకపోయేవారు.విద్య ద్వారా,విజ్ఞానం ద్వారా అనేక మంది ప్రతిభామూర్తులు విభిన్న రంగాల్లో రాణించి, ప్రపంచ ఖ్యాతి నార్జించి, భరతజాతి కీర్తి పతాకాన్ని విశ్వవినువీథుల్లో ఎగరేసి, దేశం గర్వించే ముద్దుబిడ్డలుగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. చదువంటే ఇప్పటిలా బండెడు పుస్తకాల బరువు కాదు- ప్రతిభంటే పట్టాల ప్రదర్శన అసలే కాదు.  విజ్ఞానం అనేది  చదవని  పుస్తకాల అలమారాల్లో దాగి ఉండదు.  ప్రతిభంటే  విపణిలో దొరికే విలాస వస్తువు కానే  కాదు. ఖరీదైన  కాగితాలపై బరువైన అక్షరాలతో   వ్రాయబడే అర్హతా చిహ్నం అసలే కాదు. మేథస్సు అంటే  మన మస్తిష్కంలో నిక్షిప్తమైన విజ్ఞాన భాండాగారం. ఇనుము అగ్నిలో కాలితేనే  కావలసిన వస్తువుగా   మలచుకోవచ్చు. ప్రతిభను  చదువు అనే  అగ్నిలో సానబెడితేనే  అమూల్యమైన విజ్ఞన సాధనంగా తీర్చిదిద్దబడుతుందని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ‘‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య’’ జీవితం.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు తెలుగువారు.  కన్నడకు వలసవచ్చి,అక్కడే స్థిరపడ్డారు. కన్నడనాట ఒక కుగ్రామంలో జన్మించిన విశ్వేశ్వరయ్య విజ్ఞానగని గా అవతరించి సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌లో విశేష ప్రతిభ కనబరచి ఖండాంతర ఖ్యాతి గడించాడు. పల్లెలంటే చిన్న చూపు చూసే నేటి తరం విద్యావంతులు  విశ్వేశ్వరయ్య సాధించిన విజయాలను ఆకళింపు చేసుకోవాలి. అన్ని సౌకర్యాలున్నా శ్రమించే తత్వం లేకపోవడం, సక్రమంగా చదవకుండా, పాశ్చాత్య పోకడలతో  పల్లెలను చిన్న చూపు చూస్తూ ఎ.బి.సి.డి విద్యల కోసం నగరాలకు వలసబట్టి,లక్షల రూపాయలు ధారబోసి విజ్ఞాన శూన్యులుగా మారుతున్న నేపథ్యంలో  నాటి తరం మహనీయుల స్ఫూర్తి ఆదర్శప్రాయం కావాలి.
విశ్వేశ్వరయ్య  కన్నడనాట కృష్ణ రాజసాగర్‌ ఆనకట్ట, హైదరాబాద్‌ ‌మూసీ నదుల వరద రక్షణకు విశేష కృషి చేసాడు.పూనే నగర నీటి సరఫరాకు పెద్ద పెద్ద జలాశయాల నిర్మాణంలో విశేషమైన  ఇంజనీరింగ్‌ ‌నైపుణ్యం ప్రదర్శించి బ్రిటీషు వారితోసహా పలు ప్రపంచ దేశాల మన్ననలుపొందాడు.నీటి పారుదల రంగంలో విశ్వేశ్వరయ్య ఖ్యాతి ఆచంద్ర తారార్కం.ఫ్లడ్‌ ‌గేట్ల నిర్మాణం లో అద్భుత ప్రతిభ కనబరిచిన కనబరిచిన విశ్వేశ్వరయ్య  ఇంజనీరింగ్‌ ‌రంగానికే మకుటాయమానం.మంచి నీటి పథకాలకు, కుటీర పరిశ్రమలకు, విద్యారంగానికి విశేష కృషి చేసిన విశ్వేశ్వరయ్య నీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో అనితరమైన ప్రతిభ కనబరిచాడు. విదేశీయులు సైతం మెచ్చి’’ సర్‌ ఎం‌వి’’ గా పిలబడే  మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలకు, ఇంజనీరింగ్‌ ‌ప్రతిభకు మెచ్చి భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న బిరుదుతో సత్కరించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య  అనితరసాధ్యమైన ఇంజనీరింగ్‌ ‌ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా ఆయన జన్మదినమైన  సెప్టెంబర్‌ 15 ‌వ తేదీని ‘‘ ఇంజనీర్ల దినోత్సవం’’ గా జరుపుకుంటున్నాం. నేటి తరం యువ ఇంజనీర్లు విశ్వేశ్వరయ్య లోని ఇంజనీరింగ్‌ ‌నైపుణ్యాలను,కార్యదీక్షాదక్షతలను  గుర్తించి నాణ్యమైన విద్యల ద్వారా నైపుణ్యతను పెంపొందించుకుని భారతదేశ ఖ్యాతి ని ఇనుమడింపచేయాలి.నాణ్యమైన చదువులు అందరికీ అందాలి. నైపుణ్యం లేని చదువుల వలన ప్రయోజనం శూన్యం.  అబ్దుల్‌ ‌కలాం, సతీష్‌ ‌ధావన్‌, ‌హోమీ జహంగీర్‌ ‌బాబా, సి.వి.రామన్‌, ‌శ్రీనివాస రామానుజన్‌ ‌వంటి  ప్రతిభా వంతులు  జన్మించిన పవిత్ర భరతభూమిపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ప్రజ్ఞావంతుడైన ఇంజనీర్‌ ‌జన్మించడం భారతీయులకు గర్వకారణం. ఏ రంగంలోనైనా ప్రతిభ ముఖ్యం. ఒక ఇంజనీర్‌ ‌కు ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ఖ్యాతి లభించడం  అత్యంత హర్షదాయకం. ఎన్నో నిర్మాణాల ద్వారా,నీటి ప్రాజెక్టుల రూపకల్పన ద్వారా  విశేషమైన ఖ్యాతి గడించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య  ఖ్యాతి అజరామరం.
image.png
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడె, ఏపీ
9704903463.

Leave a Reply