Take a fresh look at your lifestyle.

డిజిటల్‌ ‌ప్రసారాలు.. విద్యార్థుల కష్టాలు

UNESCO  లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 ‌మొదలైనప్పటి నుండి 1.37 బిలియన్ల విద్యార్థిని విద్యార్థులు 138 దేశాలల్లో  ఆన్‌లైన్‌ ‌విధానాన్ని అనుసరిస్తు విద్యనభ్యసిస్తున్నారు. దాదాపుగా 60.2 బిలియన్ల ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ‌యూనివర్సిటీ రీడర్స్, ‌ప్రొఫెసర్స్ ‌లాక్‌డౌన్‌ ‌విధించిన అనంతరం అందరూ విద్యకు దూరమైనారు. విద్యను జూమ్‌, •స్కైప్‌, ‌గూగుల్‌, ‌క్లాస్‌రూమ్‌ ‌ద్వారా విద్యార్థులకు బోధన చేస్తున్నారు.ఆన్‌లైన్‌ ‌బోధన ద్వారా రాష్ట్రంలోని, దేశంలోని ప్రైవేట్‌ ‌పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీలో పాలుపంచుకుంటున్నాయి.

ఆన్‌లైన్‌ ‌విద్య బోధన వల్ల టీచర్‌, ‌విద్యార్థి మధ్యన అవినాభ సంబందం కొనసాగదు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ ‌ప్రసారాలలో 14 లక్షల నుండి 16.5 లక్షల మంది విద్యార్థులు T.V, Smart phone’s  ద్వారా పాఠాలు వింటున్నారు.విద్యార్థులందరూ ఆన్‌లైన్‌ (‌డిజిటల్‌) ‌ప్రసారాలను  వినడానికి ఇష్టత, సుముఖుత చూపడం లేదు. విద్యార్థి ఒంటరిగా పాఠాలను వినడం వల్ల జ్ఞాన సముపార్జన జరుగదు. డిజిటల్‌ ‌ప్రసారాల ద్వారా తనకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం లేదు.మరో వైపు విద్యార్థి ఆన్‌లైన్‌ ‌విధానం స్వేచ్చగా ఉంటుంది.. కాలనిర్ణయపట్టికFixedగా ఉంటుంది..విద్యార్థికి సమయాన్ని ఆదా చేసి పెడుతుంది..డిజిటల్‌ ‌ప్రసారాలద్వారా విద్యార్థికి ప్రయాణ భారం తగ్గుతుంది..కోర్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది.. కానీ..

 శ్లో।। య: పఠతి లిఖిత పశృతి
పరిపృచ్ఛతి పండితానుపాశ్రయతి

తస్య దినాకిరణై : నళినీదళమివకోస్యతే బుద్ధి :
చదవడం, వ్రాయడం, చూడడం, ప్రశ్నలు వేయడం, పండితులనాశ్రయించడం వీనినెవడు చేస్తున్నాడో వాని బుద్ది సూర్య కిరణాలచే పద్మం వికసించినట్లు వికాసం పొందుతుంది..అని అర్థం..!
కేవలం విద్యార్థి వినడం, దృవ్య శ్రవణం ద్వారా 75% శాతమే విజ్ఞానం పొందుతాడు, చూడడం ద్వారా 13% వినడం,వాసన, ముట్టుకోవడం ద్వారా అన్నీ గ్రహిస్తాడు.వినడం అనేది ఒక నైపుణ్యం మాత్రమే.తెలంగాణలో చేపట్టిన ఈ డిజిటల్‌TSAT, DD YADAGIRI కొన్ని మారుమూల ప్రాంతాల విద్యార్థులకు సిగ్నల్‌ ‌లేక విద్యకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థి అనుమానాలను నివృత్తి చేసుకొనే అవకాశం లేదు. 3 నుండి 10 వ తరగతి విద్యార్థులందరికి పాఠ్య పుస్తకాలు అందరి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరము అందలేదు.విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి డిజిటల్‌ ‌ప్రసారాలను కొనసాగించాలి.
గంగాధరి శ్రీనివాస్‌, 9492725200,T.P.T.F సభ్యులు, మహబూబాబాద్‌.

Leave a Reply