Take a fresh look at your lifestyle.

జల జగడం సృష్టించిన వారే విమర్శలా? కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ సజ్జల

నెల్లూరు, ఆగస్ట్ 2 : ‌కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. వివాదం సృష్టించినవారే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.  నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలతో సక్ష నిర్వహించినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

పేదలందరికీ ఇళ్లు పథకం అమలుపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై బేరీజు వేసుకున్నామని సజ్జల అన్నారు. అంతే కాకుండా  కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్‌ ‌పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారు. ఆంధ్రా వాటా నీటిని కాపాడుకునేందుకు సీఎం జగన్‌ ‌ప్రయత్నించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Leave a Reply