Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై సమీక్ష..

హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణపై గడ్కరీ జరిపిన సమీక్షకు ఎంపి కోమటి రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు హాజరు అయ్యారు.
హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో నేషనల్ హైవే అథారిటీ( ఎన్ హెచ్ఏ), కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. హైవేను 6 లైన్లుగా మార్చడంలో జాప్యం జరుగుతుందని మంత్రికి తెలిపారు. ఇందుకు హైదరాబాద్- విజయవాడ హైవే ఎక్స్ టెన్షన్ పనుల్ని పూర్తిచేయకపోవడమే కారణమన్నారు. అగ్రిమెంట్ ప్రకారం… జీఎమ్మార్ 6 లైన్ల హైవే పనుల్ని 2020 ఏప్రిల్ లో ప్రారంభించి, 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉందని  వివరించారు. కానీ, నష్టం పేరుతో విస్తరణ పనుల్ని కొనసాగించడం లేదని, 2025 లో పనులు చేపడుతామని తెలిపిందన్నారు.
ఈ అంశంపై గడిచిన రెండేళ్లుగా పోరాడుతున్నానని, కేంద్రానికి సైతం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఒక వేళ జీఎమ్మార్ తప్పుకుంటే, కేంద్రమే టెండర్లు వేసి కొత్త సంస్థతో విస్తరణ పనుల్ని పూర్తి చేయించాలని కోరారు. ఈ విషయంలో గడ్కరీ జీఎమ్మార్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారని కోమటి రెడ్డి మీడియా ముందు వెల్లడించారు.

Leave a Reply