Take a fresh look at your lifestyle.

అం‌గన్వాడీ సిబ్బంది నియామకాలు పూర్తి

జిల్లాలోని గూడూరు, మహబూబాబాద్‌ ఐసీడీఎస్‌ ‌ప్రాజెక్ట్ ‌పరిధి లో అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీలను జిల్లా కలెక్టర్‌ ‌విపి గౌతం అధ్యక్షత న జిల్లా సెలక్షన్‌ ‌కమిటీ సమావేశమై మెరిట్‌ ఆధారంగా అభ్యర్థి నులను నియమించింది. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో మహబూబాబాద్‌ ఐసీడీఎస్‌ ‌ప్రాజెక్ట్ ‌పరిధిలోని 16, గూడూరు ఐసీడీఎస్‌ ‌ప్రాజెక్ట్ ‌పరిధిలోని 6 అంగన్వాడి టీచర్‌ ‌లు, హెల్పేర్‌ ‌లు, మినీ అంగన్వాడి పోస్టులకు అభ్యర్థినుల అర్హతలను, ధ్రువీకరణ పత్రాలను సెలక్షన్‌ ‌కమిటీ పరిశీలించి మెరిట్‌ ‌ప్రకారం అర్హులైన అభ్యర్థినులను ఆయా పోస్టులలో నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు..ఈ సమవేశంలో డి డబ్ల్యూ ఓ సంధ్యా రాణి, ఆర్డీవో కొమురయ్య, డియంహెచ్‌ఓ ‌డాక్టర్‌ ‌శ్రీరామ్‌, ‌సిడిపిఓలు పాల్గొన్నారు.

- Advertisement -

అంగన్వాడీ నియామకాల్లో అవకతవకలు:
జిల్లా పరిధిలోని గూడూరు ,మహబూబాబాద్‌ ‌మండల కు సంబంధించి అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయని . ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చేశారు బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ‌కార్యాలయంలో జరిగిన అర్హత పత్రాల పరిశీలనకు వచ్చిన అభ్యర్థుల్లో గతంలో 2018 లో దరఖాస్తు చేసుకున్నవారు లేకపోవడంతో మముల్ని కాదనివేరేవారికి ఏవిధంగా ఇస్తారని అధికారుల ను నిలదీశారు. టీచర్‌ ‌లేదా హెల్పర్‌ ఆయా గ్రామాల వారై ఉండాలని ప్రాధమిక అర్హతలు పట్టే నియమించాలని అలాకాదని కొత్తవారికి అవకాశం ఇచ్చారని వాపోయారు ఈ ప్రక్రియ అంత సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరం ఇచ్చారు

Leave a Reply