Take a fresh look at your lifestyle.

మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యత

  • హరితహారం లక్ష్యసాధన దిశగా కృషి – పంటకు అవసరమైన సాగు నీరు సమృద్దిగా అందిస్తాం
  • నూతన సాగు విధానానికి  రైతుల సంపూర్ణ సహకారం – రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  •  ‌మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌కలెక్టర్‌, ‌పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు

హరితహారం సామాజిక బాధ్యతగా భావించి ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో జడ్పీ చైర్మన్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజాపరిషత్‌ ‌సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం రూపొందించి న హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయ వంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తం గా 5విడతలలో సుమారు182 కోట్ల మొక్కలు నాటి, సంరక్ష ణ రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 6వ విడత కింద గ్రామీణ ప్రాంతాలో 60లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌, ‌బ్లాక్‌ ‌ప్లాంటేషన్‌ ‌మొక్కల సంరక్షణ బాధ్యత సదరు గ్రామ ప్రభుత్వ సిబ్బందికి అప్పగించాలన్నారు. ప్రతి గ్రామంలో పార్కు ఏర్పాటు చేసి, మొక్కలను పరిరక్షిం చాలన్నారు. ప్రజలందరు హరితహారంలో పాల్గొనెలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల, వర్గాల వారు పాల్గొన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటసాగు చేయడం ద్వారా రైతులకు మేలు జరుగు తుందన్నారు. సీఎం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధా నానికి రైతులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. జిల్లాలో 2,75,829 ఎకరాల్లో సాగు ప్రణాళిక రూపొందిం చుకొని, 1,92,651ఎకరాల్లో వరి, 81,172 ఎకరాల్లో పత్తి, 1337ఎకరాల్లో కందులు, ఇతర పంటలు సాగు చేస్తున్నామన్నారు. కందుల సాగు పెరిగే దిశగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు మంత్రి సూచించారు. వానాకాలం పంటకు రైతుకు అవసర మైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు అధీకృత డీలర్ల వద్ద విత్తనాలు కొనుగొలు చేసి, రశీదు తీసుకోవాలన్నారు. రైతుబంధు కింద వానాకాలంలో కరోనా విపత్కర సమయంలో 54.28 లక్షల రైతులలకు రూ.6886కోట్ల అందజేశామన్నారు. దేశంలో కొనుగొలు చేసిన ధాన్యంలో 55% తెలంగాణ పండించిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందన్నారు. ధాన్యం కొనుగొలు సమయంలో ఎదురైన సమస్యలు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామ న్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ధాన్యం దిగుబడి మూడింతలయిం దన్నారు. ధాన్యాన్ని మార్కెట్‌ ‌యార్డులలో, రోడ్లపై ఆరబెట్టుకొ ని రైతులు నష్టపోతున్నట్లు ఆయన వాఖ్యానించారు. ఉపాధి హామీ నిధులతో రైతు పొలాల వద్ద కల్లాల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ ప్రాజేక్టు పరిధిలో నీటి సమస్య ఉత్పన్నం కాదని, లింక్‌ ‌కాలువ పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.312కోట్లతో 19 చెక్‌ ‌డ్యాం నిర్మాణ పనులు చేపట్టిందని తద్వారా 46055ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తుందన్నారు. జిల్లాలో 81,147మంది నిరుపేదలకు ప్రతి నెల రూ.17.67 కోట్ల ఆసరా పెన్షన్‌ అం‌దిస్తున్నట్లు తెలిపారు. కొరోనా వైరస్‌ ‌నివారణకు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విఫ్‌ ‌బానుప్రసాద రావు, జడ్పీ చైర్మన్‌ ‌పుట్టమధు, జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ ‌రావు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ ‌రెడ్డి, కోరుకంటి చందర్‌, ‌జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌రఘువీర్‌ ‌సింగ్‌, ‌జడ్పీ సీఈఒ గీత, జిల్లా అధికారులు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, సంబంధిత అధికారులు, తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply