Take a fresh look at your lifestyle.

తొలిసారి ముఖ్యమంత్రిని అసెంబ్లీలో సభ్యులంతా అభినందించారు

  • ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందడానికి నిదర్శనం
  • శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌శాసనసభ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరు సభ్యులు అభినందించారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వం దగ్గరగా పనిచేస్తున్నదని అనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై హరీష్‌ ‌రావు ప్రసంగిస్తూ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఈ ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందాలనీ, ఇది ఎంతో ముఖ్యమైన బిల్లు అని చెప్పారు. గతంలో బిల్లులు పాస్‌ ‌చేసి గవర్నర్‌ ‌ద్వారా సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి గతంలో ఉండేదనీ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు చేసే అవకాశం ఉండేది కాదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లులో రూ.2 కోట్ల 26 లక్షలు నోటెడ్‌ ఎక్స్‌పెండీచర్‌ ఉం‌డగా, రూ.30 వేల 950 కోట్లు చార్జ్‌డ్‌ ఎక్స్‌పెండీచర్‌ ‌కింద సభ ముందుకు వచ్చిందని తెలిపారు. ధరణి సంబంధిత సమస్యలపై ఆప్షన్స్ ఒపెన్‌ ‌చేయడం జరిగిందనీ, పాడి పరిశ్రమ ఇన్సెంటివ్స్ ‌డబ్బులు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కొరోనా సమయంలో వైద్య శాఖలో పనిచేసిన ఉద్యోగులకు ఈ రిక్రూట్‌మెంట్‌లో కొంత వెయిటేజ్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉస్మానియాలో 2 నెలల క్రితం క్యాథ్‌ ‌ల్యాబ్‌ ‌ప్రారంభించడంతో ఆపరేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే గుండె శస్త్ర చికిత్సలు జరుగుతుండేవనీ, ఇప్పుడు ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌లోనూ క్యాథ్‌ ‌ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 50 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలలు వేతనాలు పెంచాయనీ, మెప్మాలో, సెర్ప్‌లో పని చేసే వారు ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని అడిగారన్నారు. కొద్ది మంది రాజకీయ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్లను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టారనీ, వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారిన చెప్పారు. ఈపీఎఫ్‌ ‌వడ్డీ రేట్లు పెంచే విధంగా కేంద్రాన్ని కోరతామనీ,  అసంపూర్తి భవనాలు ఉండవద్దనే ఉద్దేశ్యంతో సిడిపి నిధుల వినియోగంపైబీప నిబంధనలు తేవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో పనులు చేయాలనీ, ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply