Take a fresh look at your lifestyle.

మహిళల ఉపాధి కోసమే ఉచిత  కుట్టు శిక్షణ

చిన్నకోడూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7:మహిళలు ఆర్థికంగా ఎదిగి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ ఛైర్పర్సన్ రోజా శర్మ తెలిపారు. గురువారం చిన్నకోడూరు, పెద్దకోడూరు గ్రామాలలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని,మంత్రి హరీష్ రావు సహకారంతో సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో రెండు గ్రామాల్లో కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించినట్లు, 50 మంది మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా మహిళలకు 30 రోజులు శిక్షణ తరగతులునిర్వహిస్తున్నారని అన్నారు.దశలవారీగా గ్రామంలోని మహిళలందరికీ కుట్టు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నదని ,మహిళల కోసం ప్రవేశ పెడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు,  సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాముని ఉమేష్ చంద్ర, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రవీందర్ రెడ్డి,ఏపీఎం మహిపాల్, సిసి శ్రీనివాస్ రెడ్డి,మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply