Take a fresh look at your lifestyle.

దేశంలో దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌

  • ఒక్క రోజే కొత్తగా 17 కేసులు నమోదు..21కి చేరిన మొత్తం కేసులు
  • ప్రపంచాన్నీ వణికిస్తున్న ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌..41 ‌దేశాల్లో 722 కేసులు నమోదు
  • తాజాగా దేశంలో 8,306 రోజువారీ కొరోనా కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌వేగంగా విస్తరిస్తూ దడ పుట్టిస్తుంది. రోజురోజుకూ ఈ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. ఒక్కరోజే కొత్తగా 17 కేసులు నమోదయ్యాయంటే న్యూ వేరియంట్‌ ఎం‌తలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 2, గుజరాత్‌, ‌ఢిల్లీల్లో ఒక్కో కేసు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య 21కి చేరింది. దేశంలో న్యూ స్ట్రెయిన్‌ ‌విజృంభణతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బూస్టర్‌ ‌డోస్‌కు కసరత్తు చేస్తుంది. విడ్‌ ‌టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. బూస్టర్‌ ‌డోస్‌తో పాటు చిన్నారుల టీకాపైనా కమిటీ సభ్యులు చర్చించనున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 9 మంది, మహారాష్ట్రలో ఏడుగురు కొత్తగా ఈ వేరియంట్‌ ‌బారిన పడ్డారు. దీంతో ఒమిక్రాన్‌ ‌బారిన పడిన వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 21కి చేరింది. ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్‌, ‌ఢిల్లీ, ముంబాయిలలో ఒకొక్క కేసు వెలుగులోకి వొచ్చిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో పింప్రి చించ్వాడ్‌ ‌ప్రాంతానికి చెందిన ఒక మహిళకు, ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు సోదరునికి ఈ వేరియంట్‌ ‌సోకినట్లు జినోమ్‌ ‌పరీక్షల్లో తేలింది. వీరు నైజీరియా నుండి ఇటీవలే వచ్చారు. ఫిన్లాండ్‌ ‌నుండి వొచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ వేరియంట్‌ ‌గుర్తించారు. ఈ నిర్దారణలతో మహారాష్ట్రలో ఈ వేరియంట్‌ ‌సోకిన వారి సంఖ్య 8కి చేరింది. రాజస్థాన్‌ ‌రాజధాని జైపూర్‌లోని ఆద్షనగర్‌లో దక్షిణాఫ్రికా నుండి వొచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి ఈ వేరియంట్‌ ‌సోకినట్లు తేలింది. అయితే, వీరందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భారత్‌లో కొరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి స్పల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ‌ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,306 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా మరో 211 మంది కోవిడ్‌ ‌కారణంగా ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 8,834 మంది కోవిడ్‌ ‌బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,46,41,561కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 3,40,69,608కి చేరింది. ఇక, కోవిడ్‌తో ప్రాణాలు విడిచినవారి సంఖ్య 4,73,537కు పెరగగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌..41 ‌దేశాల్లో 722 కేసులు నమోదు
ప్రపంచాన్ని వ్యాప్తంగా ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌గడగడలాడిస్తుంది. కొరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ఇప్పు‌డు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ 41 ‌దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా 722 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఒక్క దక్షిణాఫ్రికాలో 217మంది ఒమిక్రాన్‌ ‌బారినపడ్డారు. దీంతో మళ్లీ ఏడాదిన్నర కిందటి పరిస్థితులు తలెత్తుతాయా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా తర్వాత అమెరికాలో ఒమిక్రాన్‌ ‌కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వొచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ ‌కేసులు పాకిన రాష్ట్రాల జాబితాలో తాజాగా మసాచ్యుసెట్స్, ‌వాషింగ్టన్‌ ‌కూడా చేరాయి. ఇప్పటికే న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వే నియా, మేరీలాండ్‌, ‌మిసౌరీలో కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటితో పాటు నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరెడో, ఉటాలోనూ ఒమిక్రాన్‌ ‌కేసులు నిర్దారణ అయ్యాయి. న్యూయార్క్ ‌రాష్ట్రంలో నమోదైన ఎనిమిది కేసుల్లో ఏడు గ్లోబల్‌ ‌సెంటర్‌గా ఉన్న న్యూయార్క్ ‌నగరంలోనే వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు రెండింతలకు పెరగింది.

Leave a Reply