Take a fresh look at your lifestyle.

స్కూళ్లను అందంగా ముస్తాబు చేయండి

సెప్టెంబర్‌ 5‌కల్లా సౌకర్యాలు కల్పించాలి
నాడు-నేడు కార్యక్రమంపై సిఎం జగన్‌ ‌సమీక్ష

అమరావతి,ఆగస్ట్ 4 : ‌స్కూళ్లు తెరిచే నాటికి సకల సౌకర్యాలతో పాఠశాలలు సిద్దంగా ఉండాలని సిఎం జగన్‌ ఆదేశించారు.నాడు-నేడులో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని, ప్రతి స్కూల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దా లన్నారు. అలాగే  అందమైన వాల్‌ ‌పెయింటింగ్స్, ‌బొమ్మలు వేయించి, విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉం‌డాలన్నారు. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభి ంచాలి. దానిపై అధికారులు మరింత ఫోకస్డ్‌గా పని చేయాలని సక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ’జగనన్న విద్యా కానుక కిట్‌’‌ను జగన్‌ ‌పరిశీలించి..అధికారులని అభినందించారు. నాడు-నేడు (మనబడి) మిగిలిన దశ పనులపైనా సక్ష నిర్వహించారు. సకాలంలో ఆయా పనులు చేపట్టాలన్న సీఎంనిధులకు కొరత లేకుండా చూస్తామని వెల్లడించారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సక్షా సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ ముందుగా అనుకున్నప్రకారమే సెప్టెంబర్‌ 5‌న జగనన్న విద్యాకానుక నిర్వహించనున్నట్లు తెలిపారు.అదే రోజు సూళ్ల పునర్‌ ‌ప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరోవైపు మొదటిదశ నాడు-నేడు పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. జగనన్న విద్యాకానుకతో పాటే నాడు-నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు.కాగా విద్యాకానుకకు సంబంధించి విద్యార్థులకు అందించే వస్తువు లను సీఎం జగన్‌ ‌పరిశీలించారు.పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు మాస్క్, ‌బుక్స్,‌స్కూల్‌ ‌యునిఫామ్‌,‌బ్యాగ్స్ ఉం‌డేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొ న్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు టెస్ట్‌బుక్స్ ‌కూడా చేరాయని..త్వరలోనే విద్యార్థులకు అందిస్తామన్నారు.కరోనా నేపథ్యంలో గైడ్‌లైన్స్ ‌ప్రకారమే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు.కాగా ముఖ్య మంత్రి జగన్‌ ఈరోజు నాడు-నేడు,జగనన్న విద్యాకానుకపై పూర్తి స్థాయి సక్ష నిర్వహించారన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అన్ని విధాల సిద్ధంగా ఉందని ఆదిమూలపు సురేశ్‌ ‌పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply