Take a fresh look at your lifestyle.

అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 10 : శ్రీ రామాంజనేయ నాట్య కళామండలి రాచులూరు ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ పులిగిల్ల శ్రీనివాసచారి ప్రోత్సాహంతో సోమవారం రాత్రి కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకమును ప్రదర్శించారు.దుర్యోధనుడి ఏక పాత్రభినయం,పడక సీను చూపరులను కనువిందు చేసింది.కళామండలి వారు నాటకం ప్రదర్శించే ముందు కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి,ఆయా పార్టీల సర్పంచులు,నాయకులను ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన చేయించారు.ఈ సందర్భంగా అతిథులను ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు.ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో మరుగున పడ్డ నాటకాలను మళ్ళి జివంపొసి వెలికితీయడం శుభపరినామమని ఆయన కొనియాడారు.తన చిన్న తనంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళి వీది నాటకాలను చూసే వారమని తెలిపారు.ప్రతి ఏటా రాచులూరు గ్రామానికి పరిమితమైన పౌరాణిక పద్య నాటకాలను ఒక్కసారి కందుకూరు మండల కేంద్రంలో వేయాలని నాట్య కళామండలి వారు నిర్ణయం తీసుకొవడం గర్హనీయమని కొనియాడారు.రాచులూరు సర్పంచ్ పి. శ్రీనివాసచారి ప్రోత్సాహంతో ఈ పద్య నాటకాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతిక పౌర,పౌరాణిక పద్య వీధి నాటకాలకు ప్రజలు ప్రోత్సాహం తెలుపుతూ ప్రజలు కళాకారులకు మద్దతు తెలుపుతున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు.టీవీ మాధ్యమాలు,సోషల్ మీడియా రావడంతో గతంలో పౌరాణిక నాటకాలకు ఉన్న గుర్తింపు నేటి తరంలో పూర్తిగా నశించిపోతున్న తరుణంలో గత పది సంవత్సరాల నుండి రాచులూరు శ్రీ వీరాంజనేయ నాట్య కళామండలి వారు ప్రతి ఏటా రాచులూరు గ్రామంలో ఈపద్య నాటకాన్ని కళాకారులు వేయడం జరుగుతుందని,నేడు మండల కేంద్రంలో వేయడం ఆనంద దాయకమన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పౌరాణిక పద్య నాటకాలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని కళాకారులను ప్రోత్సహించి వారి వెన్నంటి ఉంటే అన్ని గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవచ్చని వారు తెలిపారు.శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకంలో మయసభ దుర్యోధన ఏకపాత్రాభినయం,పడక సీను,ఉప ప్లావ్యము,కౌరవసభ,కర్ణ సందేశం సీనులు మహాద్భుతమని వారు కొనియాడారు. దుర్యోధనుడిగా పున్న బిక్షపతి,శ్రీకృష్ణుడుగా జాపాల అంజయ్య,రవిందర్లు,భీమునిగా దాదే యాదయ్య యాదవ్,కర్ణుడు జాపాల కిష్టయ్య,అర్జునునిగా వరికుప్పల బాలరాజ్,ధర్మరాజుగా సన్నీళ్ల వెంకటేశం, ద్రౌపదిగా రేణుకలు పాత్రలు నిర్వహించారు. డాన్సర్ గా దేవి అండ్ బృందం,సంగీతం  షాద్నగర్ కు చెందిన కె.మనోహరాచారిలు నిర్వహించారు.

Leave a Reply