Take a fresh look at your lifestyle.

శివ నామస్మరణలతో మారుమోగుతున్న వేములవాడ

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేము)వాడ భ్త జన సంద్రంగా మారింది. ఆలయ ప్రాంగణం,గుడిచెరువు,జాత్రాగ్రౌండ్‌,‌వేములవాడలోని అన్ని వీధులు కిక్కిరిసిపోయాయి.గురువారం  అర్ధరాత్రి నుండి వేలాది భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి, కోడె మొక్కులు చెల్లించుకోవడా నికి, శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.ఈ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కనీసం నాలుగు  గంటల పాటు వేచి ఉండి, మహామండపంలోకి ప్రవేశించి, శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.ఇదే సమయం లో కోడె మొక్కులు చెల్లించుకోవడం,తలనీలాలు సమర్పించుకోవడం,గండాదీపంలో నూనె పోయ డానికి భక్తులు గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది.ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాతర సమన్వయ కమిటి చైర్మన్‌, ‌కలెక్టర్‌  ‌కృష్ణ భాస్కర్‌, ఆర్డీఓ శ్రీనివాస రావులు నిరంతరాయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
ఈ పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, టిటిడి తరపున  అధికారులు,అర్చకుల  బృందం పట్టు వస్త్రాలను సమర్పించారు.శుక్రవారం ఉదయం 7 గంటలకు టిటిడి తరపున టిటిడి  బృందం మేళతాళాల మధ్య పట్టు వస్త్రాలను ఆలయానికి తీసుకుని వచ్చి శ్రీస్వామివారికి సమర్పించారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రె డ్డి, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరివెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, వేము)వాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌,‌రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ,వేము)వాడ మున్సిపల్‌చైర్‌ ‌పర్సన్‌ ‌రామతీర్ధపు మాధవి,జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ,ఆర్డీఓ శ్రీనివాస రావు, దేవస్థానం ఇఓ కృష్ణవేణి తదితరులు ఉన్నారు. శ్రీస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన పిదప వీరందరికి స్థానాచార్య అప్పాల భీమాశంక ర్‌ ‌శర్మ అధ్వర్యంలోని అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనమివ్వగా ఇఓ  కృష్ణవేణి సత్కరించారు.

దీక్షలు విరమించిన రాజన్న దీక్షా ధారులు
ఈ పర్వదినం పురస్కరించుకుని గత 41 రోజుల నుండి శివదీక్ష( రాజన్న దీక్ష ) చేస్తున్న భక్తులంతా శుక్రవారం సాయంత్రం 6గంటలకు తమ దీక్ష విరమించారు.వందలాది దీక్షా ధారులు ఊరేగిం పుగా  తమకు కేటాయించిన నిర్ణీత సమయంలో ఆలయానికి చేరుకుని ఇరుముడులు చెల్లించి, శ్రీస్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి, పూజలు నిర్వహించారు.ఈ ఊరేగింపు సందర్భం గా మేన్‌రోడ్డు,రాజన్న గుడి ముందు భాగం ఇసుక వేస్తే రాలనంతగా మారింది.దీనితో భక్తులు, అధికారులు కొద్దిసేపు ఆందోళనగా కనిపించారు.
వైభవంగా మహాలింగార్చన… మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
సోమవారం సాయంత్రం ఆరుగంటల నుండి శ్రీస్వామివారి కళ్యాణ మండపంలో స్థానాచార్య అప్పాల భీమాశంకర్‌ ‌శర్మ అధ్వర్యంలో వేదపండి తులు,అర్చకులు,స్థానిక బ్రాహ్మణోత్తము లు మహాలింగార్చనను భక్తిశ్రద్దలతో, వేద మంత్రోచ్చా రణల మధ్య నిర్వహించారు. అనంత రం వారం తా శ్రీస్వామివారికి అభిషేకం నిర్వ హించారు. అర్థరాత్రి లింగోద్భవ సమయంలో శ్రీస్వామివారి కి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.శనివారం వేకువ జామువరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగింది.

ప్రారంభమైన జాగరణలు
ఈ పర్వదినం సందర్భంగా శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులంతా ఆలయ ఆవరణలో జాగరణలు ప్రారంభించారు.ఈ జాగరణల సందర్భంగా భక్తులంతా ప్రమిదల్లో దీపాలు వెలిగించి, శ్రీస్వామివారిని ప్రార్థిస్తుండటంతో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అధికారులు, ఫైర్‌ ‌సిబ్బంది పర్యవేక్షించారు.శనివారం  ఉదయం ఈ జాగరణలను వారు విరమించారు.

ఆకట్టుకున్న శివార్చన కార్యక్రమాలు
ఈ జాగరణలు జరుగుతున్న సమయంలోనే గుడిచెరువులో రాష్ట్ర భాషా సాంస్క•తిక శాఖ అధ్వర్యంలో శివార్చన కార్యక్రమాన్ని నిర్వహించ గా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో వందలాది కళాకారులు ప్రదర్శిం చిన శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనలు,జానపద కళాప్రదర్శనలు,కోలాటాలు,ఒగ్గుడోలు ప్రదర్శనలు భక్తులందరిని ఆకట్టుకున్నాయి.

భక్తులకు ఉచితంగా మజ్జిగ పాకెట్లు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీస్వామివారిని దర్శించుకునే భక్తులకు వివిధ సిమెంట్‌ ‌కంపెనీలు వేములవాడలోని సిమెంట్‌ ‌దుకాణాల డీలర్ల అధ్వ ర్యంలో ఉచితంగా మజ్జిగ పాకెట్లను అందజేశా రు. ఈ  మజ్జిగ పాకెట్ల పంపిణిని రాష్ట్ర దేవాదా య శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ‌ప్రారంభించగా సిమెంట్‌ ‌దుకాణాల డీలర్లు నగుబోతు రవి,తీగల వేంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నిరంతర వైద్య సేవలు  
ఈ జాతరలో పలువురు భక్తులకు వివిధ ఇబ్బందులకు గురికావడంతో వారికి ఆరోగ్య వైద్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాల్లో వైద్య సిబ్బంది చికిత్సలు కొనసాగించారు.ఇదే సమ యంలో సెస్‌ ‌సిబ్బంది అహర్శిలు కృషి చేస్తూ విద్యుత్‌ ‌సరఫరాలో ఎలాంటి అంతరాయం లే కుండా చూశారు.సత్యసాయి భక్తులు, ఎన్‌ఎస్‌ ఎస్‌ ‌వలంటీర్లు, పోలీసులు భక్తులకు తగిన సేవలందించడమే గాకుండా ఆలయంలో రద్దీని నియంత్రించడానికి విశేషంగా కృషి చేశారు.

అలరించిన శివార్చన కార్యక్రమాలు
వేములవాడ దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర సాంస్క•తిక మండలి అధ్వర్యంలో శివార్చన కార్యక్రమం గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మం•త్రి ఇంద్రకరణ్‌రెడ్డి,వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌లు ప్రారంభించారు.ఈ శివార్చనలో గురువారం రాత్రి ప్రదర్శించబడిన ఒగ్గు డోలు కళాకారుల విన్యాసం,పేరిణి శివతాండవం,కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులందరిని పరవశింప చేశాయి. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా మరిన్ని ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంస్క•తిశాఖ డైరెక్టర్‌ ‌మామిడి హరికృష్ణ వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.