Take a fresh look at your lifestyle.

హాలో మాదిగ.. ఛలో హైదరాబాద్‌ !!

Hello Maddiga.. Chalo Hyderabad
‌ఫి•బ్రవరి 8న రిజర్వేషన్‌ ‌వర్గీకరణపై ఆమరణ దీక్ష : మాదిగ జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు రవి పిలుపు

పెద్దపల్లి: ఎస్సీ రిజర్వేషన్‌ ‌వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్‌తో పిబ్రవరి 8న నిర్వహించే మాదిగల సామూహిక అమరణ దీక్షకు హాలో మాదిగ..ఛలో హైదరాబాద్‌ ‌విజయవంతం చేయాలని మాదిగ జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు 18%కి పెంచి, ఎబిసిడిలుగా వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ప్రస్తుతమున్న 15% ఎస్సీ రిజర్వేషన్లను 18%కు పెంచాలన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీలు 17.4%శాతంగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. గడిచిన 6సంవత్సరాలలో ఎస్సీల జనాభా మరింత పెరిగినందున తమకు 18% రిజర్వేషన్‌ ‌కల్పించాలని ఆయన కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను 16%గా చేయాలని సిఎం కెసిఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, మోఢీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ఆగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిందని ఆయన ధ్వజమేత్తారు. 1950 నుండి రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించిన ఆగ్ర వర్ణాలు, నేడు మోఢీ ప్రభుత్వం చేసిన 10% రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయని ఎద్దెవా చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో జనాభా పరంగా ‘ఎస్సీ-బి’కి 12% ఉన్న మాదిగలకు 7%శాతం రిజర్వేషన్‌ ‌కేటాయిస్తే మాదిగ జాతికి అన్యాయం చేయడమేనని ఆవేధన వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్‌ ‌స్థాపించిన 1994 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ప్రస్తుతం ఉన్న నేటి జనాభా ప్రతిపాదికన వర్గీకరణ మొత్తాన్ని పునర్‌నిర్వచించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ-డిలో ఉన్న ‘ఆదిఆంధ్ర’ నేడు లేరన్నారు. వ్యక్తిగతంగా తనకు మంద కృష్ణ మాదిగకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. మాదిగ రిజర్వేషన్‌కు ఎనాడు మద్దతు ఇవ్వని ఆర్టీసి కార్మి•• సంఘాల ఆధ్వర్యంలో చేసిన సమ్మెకు మంద కృష్ణ మాధిగ ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. 2014లో మాదిగ జెఎసి సంఘం స్థాపించి నాటి నుండి అనేక ఉద్యమాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కొరకు వ్యయప్రయాసలకోర్చి అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేసినట్లు తెలిపారు. పిబ్రవరి 8న మాదిగ రిజర్వేషన్‌ ‌సాధించడంమే లక్ష్యంగా హైదరాబాద్‌లో మాదిగల సామూహిక అమరణ నిరహార దీక్ష చేపట్టినట్లు రవి తెలిపారు. వర్గీకరణ కొరకు ఎంత దూరమైన సిద్దమని కేంద్ర ప్రభుత్వాని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు అందరు దీక్షలో పాల్గొనాలని పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, మొలుగూరి కమల్‌, ‌మంథని లక్ష్మణ్‌, ‌కల్వల సది, అంజయ్య, పాల్గొన్నారు.

Tags: peddapalli,SC Reservation, Classification, feb 8th, Settlement fasting, chalo hyd

Leave a Reply