Take a fresh look at your lifestyle.

ఎన్నికలహామీలలో పెట్రోలియం, డీజిల్‌ ‌ధరలపై విధించే పన్ను తగ్గింపు ఉండదా?

సుమారు 48 రోజుల పాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రభుత్వరంగ చమురు దిగ్గజాలు తాజాగా రేట్లను పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 17 పైసలుపెరిగి 81.23ను తాకింది. ఈ బాటలో డీజిల్‌ ‌ధరలు సైతం లీటర్‌కు 22 పైసలు అధికమై 70.68కు చేరాయి. అయితే వ్యాట్‌ ‌తదితరాల నేపథ్యంలో రాష్ట్రాల వారీగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలలో వ్యత్యాసాలు నమోదయ్యే సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ 22 ‌పైసలు పెరిగిరూ. 85.47కు చేరగా, డీజిల్‌ ‌ధరలు మరింత అధికంగా 28 పైసలు బలపడిరూ. 77.12ను తాకినట్లు తెలుస్తోంది. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదిత• •అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా, శుక్రవారం లండన్‌ ‌మార్కెట్లో బ్రెంట్‌ ‌చమురు బ్యారల్‌ ‌దాదాపు 2 శాతం జంప్‌ ‌చేసి 45 డాలర్లచేరువలో ముగిసింది. ఇక న్యూయార్క్ ‌మార్కెట్లో నైమెక్స్ ‌బ్యారల్‌ ‌సైతం 1 శాతం ఎగసి 42.15 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితరపలు అంశాలు ఇండియన్‌ ‌క్రూడ్‌ ‌బాస్కెట్‌ ‌ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను చమురు పీఎస్యూలు, బీపీసీఎల్‌, ‌హెచ్పీసీఎల్‌, ఐవోసీ సవరిస్తుంటాయి. ఇంధన ధరలను నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయి. దాని ద్వారానే ధరలు నిర్ణయం ఉంటుంది.

  1. రిఫైనరీల నుంచి ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలు ఒకధరతో కొనుగోలు చేస్తాయి. ఇది ఎగుమతి అయ్యే ముడి చమురు ధర, రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది.
  2. పెట్రోల్‌ ‌పంపులకు పెట్రోల్‌ ‌డీజిలును చేరవేసేందుకు అయ్యే రవాణా ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆయిల్‌ ‌మాటింగ్‌ ‌కంపెనీలు తమ మారిన్‌ ‌వేసుకుని డీలర్లకు సరఫరా చేస్తాయి.
  3. పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరలు జీఎస్టీ పరధిలోకి రావు కనుక కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ ‌సుంకం విధిస్తుంది.
  4. డీలర్‌కు మిషన్‌ ఇం‌ధన ధరలపై ఉండటంతో పాటు రాష్ట్రం విధించే వ్యాట్‌ ‌కూడా ప్రభావం చూపుతుంది. వ్యాట్‌ ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది.

ఎక్సైజ్‌ ‌డ్యూటీ: భారత్లో పెట్రోల్‌ ‌ధరలు అధికంగా ఉండటానికి ఎక్సైజ్‌ ‌పన్నులే ప్రధాన కారణం. దక్షిణాసియాలో భారత్లోనే ఎక్సైజ్‌ ‌సుంకం అధికంగా ఉంది. చమురు ధరల్లో సగం వరకు ఎక్సైజ్‌ ‌పన్ను ఉంటోంది.
వ్యాట్‌: ‌కేంద్రం వడ్డించే ఎక్సైజ్‌ ‌సుంకానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను-వ్యాట్‌ ‌వసూలు చేస్తున్నాయి. ఈ పన్ను తగ్గించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా, మహారాష్ట్ర, గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌మినహా మిగిలిన రాష్ట్రాలు తగ్గించలేదు.
అధిక డిమాండ్‌ : ‌పెట్రోల్‌ ‌ధరలు పెరుగుతున్నా దానికి డిమాండ్‌ ‌మాత్రం తగ్గడం లేదు. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.పెట్రోల్‌కు మనం ఇచ్చే డబ్బులో సగం ముడి చమురు కొనుగోలు, రిఫైనరీకివెళుతుంది. ఇకమిగతా సగం పన్నులు కమిషన్ల రూపంలో వెళుతుంది. ఇందులో సింహభాగం కేంద్రప్రభుత్వానికిఎక్సైజ్‌ ‌డ్యూటీరూపంలో లీటరుకు రూ.19.48 వెళుతుంది. రెండో అంశం వ్యాట్‌. ఇది రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. చాలా వరకు రాష్ట్రాలు కేంద్రప్రభుత్వం విధించే సెంట్రల్‌ ఎక్సైజ్‌ ‌సుకాని కంటే, ఎక్కువగానే వ్యాట్‌ను విధిస్తున్నాయి. మూడోది డీలర్‌కు మిషన్‌. ఉదాహరణకు ఒక వినియోగదారుడు 10న ఢిల్లీలో లీటర్‌ ‌డిజీలుకు రూ. 70.68తో కొనుగోలు చేసి ఉంటే… అందులో రూ.35.34 ఇండియన్‌ ఆయిలుకు వెళుతుంది. రూ.19.48 ఎక్సైజ్‌ ‌సుంకం రూపంలో కేంద్రప్రభుత్వానికి వెళుతుంది.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్‌ ‌రూపంలో రూ.12..22 వెళుతుంది. మిగతాది అంటే రూ. 3.64 పెట్రోల్‌ ‌పంపు డీలరుకు కమిషన్‌ ‌రూపంలో వెళుతుంది.

ఎన్నికల హామీలో సామాన్యునికి జేబులు నింపని హామీలు ఇచ్చే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం, డీజిల్‌ ‌ధరలపై తాము విధించే పన్నును తగ్గిస్తాము అని ఎందుకు హామీ ఇవ్వట్లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన వినియోగదారుడు ఆ భారం మోయాల్సిందే, అంతర్జాతీయంగా ధరలు తగ్గిన కూడా ఎక్కువ ధరను చెల్లించాల్సి రావడం మన ప్రభుత్వాల దోపిడీకి నిదర్శనం అని చెప్పవచ్చు. ప్రపంచంలో మన పొరుగు దేశాల కంటే మన దగ్గరే ఎక్కువ పన్నులు ప్రభుత్వాలు విధించడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయని చెప్పవచ్చు.

డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply