Take a fresh look at your lifestyle.

‌ప్రపంచం చూపు…భారత్‌ ‌వైపు

  • స్థిరమైన ప్రభుత్వంతో సుస్థిర అభివృద్ధి
  • ఆర్టికల్‌ 370 ‌నుంచి ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌వరకు స్థిర నిర్ణయాలు
  • రానున్న 25 ఏళ్లు అమృతకాలం
  • పేదరిక రహిత భారత్‌ ‌నిర్మాణం లక్ష్యం
  • అవినీతి రహిత దేశం దిశగా అడుగులు
  • దేశ నిర్మాణంలో యువత, మహిళా శక్తిదే కీలక పాత్ర
  • ప్రజల అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు
  • ప్రభుత్వంలో పెరిగిన జవాబుదారీ తనం
  • 2047 నాటికి  సువర్ణ భారత్‌ ‌నిర్మాణం
  • ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

న్యూ దిల్లీ, జనవరి 31 : ప్రపంచ దేశాలన్నీ భారత్‌ ‌వైపు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్‌ ‌పై  ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు.సుస్థిరమైన ప్రభుత్వం కారణంగానే దేశం అభివృద్దిలో పరుగులు తీస్తుందని అన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టాక ఉభయసభలనుద్దేశించి మంగళవారం తొలిసారి ప్రసంగించారు. ఆత్మనిర్బర్‌తో ఆధునిక భారత నిర్మాణం జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పేదలు లేని భారత్‌ ‌కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఆమె..యువ, మహిళా శక్తి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అవినీతి లేని దేశం వైపు భారత్‌ అడుగులేస్తుందని ముర్ము చెప్పారు. దేశాభివృద్ధిలో రానున్న పాతికేళ్లు అత్యంత కీలకమని అన్నారు. 75ఏండ్ల స్వాతంత్య ్రఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఆర్టికల్‌ 370 ‌నుంచి ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌వరకు స్థిర నిర్ణయాలతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని ముర్ము అభిప్రాయపడ్డారు. 9ఏండ్ల పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముర్ము స్పష్టంచేశారు.

దేశానికి అతిపెద్ద ముప్పుగా మారిన అవినీతిని అంతమొందించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచామని ముర్ము ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకొన్నామని గుర్తు చేశారు. స్వాతంత్య్ర వొచ్చి 75 ఏళ్ల ఉత్సవాలు పూర్తిచేసుకున్నా..రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం అని అన్నారు. 2047 నాటికి గత పునాదులపై ఆధునికత సువర్ణ అధ్యాయా లతో కూడిన బలమైన దేశాన్ని నిర్మించాలని, స్వావలంబన, మానవతా ప్రాతిపదికన బలమైన దేశాన్ని నిర్మించాలన్నారు. పేద, మధ్యతరగతి, యువత, మహిళలు సహా అన్ని వర్గాల పౌరులు అభివృద్ధి చెందాలి.. సమాజానికి, దేశానికి బాటలు చూపించడంలో యువత, మహిళలు ముందుండాలి.. యువత అందరికంటే రెండడుగులు ముందుండాలని అన్నారు. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ రోజు దేశంలో స్థిరమైన, నిర్భయ, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉంది. ఇది పెద్ద కలలను సాకారం చేయడానికి కృషి చేస్తుందన్నారు.

రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలన్నదే లక్ష్యం అన్నారు. ప్రపంచమంతా భారత్‌ ‌వైపు ఆశావహ దృక్పథంతో చూస్తుంది. నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు సేవలందుతున్నాయి. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడుతున్నామని ద్రౌపది ముర్ము అన్నారు. మాది ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వం.సర్జికల్‌ ‌స్ట్రయిక్‌  ‌ద్వారా సరిహద్దులు దాటిన ముష్కర మూకలను మట్టుబెట్టాం. ఆర్టికల్‌ 370 ‌రద్దు, ట్రిబుల్‌ ‌తలాక్‌ ‌వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. డిజిటల్‌ ఇం‌డియా దిశగా భారత్‌ ‌ముందుకెళ్తుంది. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం. పేదల ఆలోచన స్థాయిని కూడా పెంచుతున్నాం. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చాం. జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నాం. అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతుంది. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచామని అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి మన దేశం పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో ప్రకాశించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

మానవతావాద కర్తవ్యాలను నెరవేర్చగలిగే స్వయంసమృద్ధ భారత దేశాన్ని మనం నిర్మించాలన్నారు. రానున్న పాతికేళ్లు అమృత కాలమని, ఈ కాలంలో అభివృద్ధి చెందిన భారత దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. మనందరి కోసం, దేశంలోని ప్రతి పౌరుని కోసం మన కర్తవ్యాలను నెరవేర్చవలసిన కాలం ఇది అని తెలిపారు. నేటి నుంచి అప్పటి వరకు ఉన్న పాతికేళ్ళ సమయాన్ని అమృత కాలంగా అభివర్ణిస్తున్నారు. ఈ అమృత కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.నేడు ప్రతి భారతీయుడి ఆత్మ విశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. నేడు ప్రపంచం మనల్ని చూస్తున్న తీరు అద్భుతమని తెలిపారు. గతంలో మనం ప్రపంచంపై ఆధారపడే వారమని, ఇప్పుడు ప్రపంచమే మనపై ఆధారపడుతోందని చెప్పారు. పేదరికంలేని భారత దేశాన్ని నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా సంపన్నులు కావాలన్నారు. సమాజానికి, దేశానికి దిశా నిర్దేశర చేయడానికి యువత, నారీశక్తి ముందు వరుసలో ఉండాలని తెలిపారు. కాలానికి రెండు అడుగులు ముందు నిలిచే యువత గల దేశంగా భారత దేశం ఎదగాలన్నారు. అంతుకుముందు రాష్ట్రపతి ద్రౌది ముర్ము రాష్ట్రపతి భవన్‌ ‌నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో పార్లమెంటుకు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీ స్పీకర్‌ ఓం ‌బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ ‌జగ్‌దీప్‌ ‌దన్‌కడ్‌ ‌తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బిఆర్‌ఎస్‌, ఆప్‌లు బహిష్కరించాయి.

Leave a Reply