Take a fresh look at your lifestyle.

సమాజాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం

ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కున్నాం
ధైర్యం చెప్పేందుకు పెద్దన్నగా మోదీ మాకోసం వొచ్చారు
మాదిగల విశ్వరూప సభలో మందకృష్ణ మాదిగ
భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్‌ అధినేత
ఓదార్చి అనునయించిన ప్రధాని

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశువుల కంటే హీనంగా సమాజం తమను చూసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్స్ ‌లో ఏర్పాటుచేసిన మాదిగల తరఫున మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాము ఊహించని కల అన్నారు. సమాజంలో తమను హీనంగా చూసిన రోజు నుంచి, మనల్ని గుర్తించి, మన సమస్యల్ని తెలుసుకునేందుకు దేశానికి పెద్దన్న అయిన ప్రధాని మోదీ వచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మంద కృష్జ మాదిగ మాట్లాడుతూ..‘మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పిన నేత ప్రధాని మోదీ. దశాబ్దాలుగా మమ్మల్ని హీనంగా చూశారు. మాదిగలకు పెద్దన్నగా మోదీ మాకోసం వచ్చారు. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌లా మాటలు చెప్పే పార్టీ బీజేపీ కాదు. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌ల సామాజిక న్యాయం కేవలం ఉపన్యాసాలకు పరిమితమైంది. బీసీని సీఎం చేస్తానని చెప్పిన దమ్మున్న నేత మోదీ. అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో దేశానికి సామాజిక న్యాయం చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ. పేద కుటుంబం నుంచి వచ్చిన బీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారు.
ప్రపంచ దేశాలలో ప్రభావం చూపుతున్న నేతగా ఎదిగారు. తెలంగాణ గడ్డవి•ద సైతం బీసీ బిడ్డను సీఎం చేస్తానని వి•రు చేసిన ప్రకటన మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు.  సామాజిక న్యాయం అనే అజెండా లేకపోతే ప్రధాని మోదీ మా వి•టింగ్‌ ‌కు వచ్చే వారు కాదు. బీసీల కంటే అట్టడుగున ఉన్న దళితుల్ని రాష్ట్రపతిని చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక గిరిజనుల్ని సైతం రాష్ట్రపతి చేశారు. కాంగ్రెస్‌ ‌హయాంలో ఇలాంటివి జరగలేదు. కేసీఆర్‌ ‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన వారిలో నేను ఒకడిని. కానీ కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో 18 మంది మంత్రులుంటే ఒక్క మాదిగ మంత్రి లేరు. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. వెలమ సామాజికవర్గం ఒక్కశాతం కూడా లేకున్నా కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు ఇలా ఎంతో మంది మంత్రులయ్యారు. రెడ్లలో ఏడుగురు మంత్రులయ్యారు. కానీ మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’ అని పలు కీలకాంశాలు ప్రస్తావించారు. మహాసభ వేదికపై మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ భుజం తట్టి ఓదార్చారు. విశ్వరూప మహాసభకు వొచ్చిన మోదీకి మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ సభకు ప్రధాని మోదీ వొస్తారని మేం ఊహించలేదు. ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది.’ అని మందకృష్ణ అన్నారు.

Leave a Reply