Take a fresh look at your lifestyle.

న్యాయ చరిత్రలో బ్లాక్‌ ‌డే : అసదుద్దీన్‌ ఓవైసీ

భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.  బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోందని, ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారు.  సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయం భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్‌ ‌డే అన్నారు.

ఇప్పటి ఈ కేసులో సుప్రీమ్‌కోర్టు తీర్పును ఇచ్చిందని, చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లు అసదుద్దీన్‌ ‌తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉండెనని, కానీ వారికి రాజకీయంగా లబ్ది జరిగినట్లు ఓవైసీ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

Leave a Reply