Take a fresh look at your lifestyle.

ఎన్నికల్లో ఈసీ నిబంధనలు

న్యూదిల్లీ,మార్చి18: లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ తేదీలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికలు అనగానే ఎంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో అభ్యర్థికి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. లోక్సభ అభ్యర్థులెవరూ రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదని అసెంబ్లీ అభ్యర్థి రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి నామినేషన్ దాఖలుతో పాటు రోజువారీ ఎన్నికల ఖర్చులను డైరీలో నమోదు చేయాలి. ఎన్నికల క్రతువు పూర్తయ్యేంత వరకు అన్ని లెక్కలను రాసుకోవాలి. వోటర్ల సంఖ్య ఆధారంగా ఈసీ గరిష్ఠ వ్యయ పరిమితిని నిర్ణయిస్తుంది. రాజకీయ పార్టీలకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఉంది.

లోక్సభ ఎన్నికల్లో గరిష్ఠ వ్యయ పరిమితి 20 ఏళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో అభ్యర్థులు లేదా కార్యకర్తలు తమ వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉంచుకోవడానికి వీలు లేదు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, టీ, బిస్కెట్లు, బెలూన్లు వంటి ప్రతి వస్తువుపై ఖర్చు వివరాలను చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సైతం ఈ ఖర్చులకు ధరలు నిర్ణయించింది. గ్రాణ ప్రాంతాల్లో నెలవారీ ఆఫీసు అద్దె రూ. 5000 కాగా నగరాల్లో రూ.10,000గా స్పష్టం చేసింది. కప్పు టీ ధర రూ.8 కాగా సమోసా ధర రూ.10. బర్ఫీ కిలో రూ.200, బిస్కెట్లు రూ.150, బ్రెడ్ పకోడా రూ.10, శాండ్విచ్ రూ.15, జిలేబీ రూ.140గా నిర్ణయించారు.
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Leave a Reply