వలస కార్మికులపై మోడీ, కేసీఆర్ నిర్లక్ష్యం: పీసీసీ చీఫ్ ఉత్తమ్
కొరోనా లాక్ డౌన్ సమయంలో లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు వలుస కార్మికులను ఆదుకునే విషయంలో దారుణంగా వైఫల్యం చెందారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.వలస కార్మికుల విషయంలో కనీస మానవీయంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం గాంధీభవన్ లో టీపీసీసీ ఐటీ సెల్ అధ్యక్షుడు మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో వలస కార్మికుల పై రూపొందించిన వెబ్ పోర్టల్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఉత్తమ్ మీడియా తో మాట్లాడుతూ….వలస కార్మికులు చచ్చిపోయిన పర్వాలేదనుకున్నారా అని ప్రశ్నించారు.మొత్తం వలస కార్మికులు 13 కోట్లు ఉన్నారని తెలిపారు.నగదు బదిలి ఆహార ధాన్యం పంపిణీ చేసుంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదన్నారు.కోట్ల మంది వలస కార్మికుల విషయంలో ఇంత వరకు ఏలాంటి ప్లాన్ లేదని విమర్శించారు.సీఎం కేసీఆర్ అన్నింటికి ఆయనే ఎక్స్ పర్ట్ లా మాట్లాడుతాడని వలస కార్మికులను తరలించడానికి ఆర్మీని రంగంలోనికి దించింతే బాగుండేదని సూచించారు. వలస కార్మికులను తరలించడంలో ఎమ్మెల్యేజగ్గారెడ్డి బాగా పనిచేసారని ప్రశంసించారు.
ప్రజలు గాలి పీల్చుకోవాలన్న కేసీఆర్ అనుకుమతి కావాలేమో …జగ్గారెడ్డి
ప్రజాతంత్ర ,హైదరాబాద్ : తెలంగాణ రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.రైతును ఆదుకోవాలే కానీ, శాసించే హక్కు సీఎం కేసీఆర్ కి లేదన్నారు. శనివారం గాంధీభవన్ లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ….ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతు బందు అంటూ సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఏం పంట వేయాలో, ఏం తినాలో నిర్ణయించే అధికారాం సీఎంకు ఎవరిచ్చారని ….ఇకనుంచి ప్రజలు గాలి పీల్చుకోవాలన్న సీఎం అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఇచ్చే 5 వేల పై ఆధారపడి రైతు సాగు చేయడం లేదని సీఎం రైతుబంధు తప్పించుకునేందు షరతులు పెడుతున్నారని విమర్శించారు.ఇలా ఖండిషన్ పెట్టడం అంటే రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు .అధికారం లోకి వచ్చి ఇన్ని రోజులు అయిన లక్ష రూపాయలు ఋణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు..ఇప్పటికే పెట్టుబడి లేక, లేబర్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఇప్పటవరకూ ప్రకృతి విపత్తుల వలన నష్ట పోయిన వారికి సాయం అందలేదని ఆరోపించారు.